ఎవరినైనా విమర్శించాలి అన్న.. ఎవరినైనా తిట్టాలి అన్న అది వైసీపీ ప్రధాన కార్యదర్శి.. రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డికే చేతనవుతుంది.. ఎందుకంటే ఎవరైనా సరే విమర్శలు చేశారు అంటే ఆరోజు ట్విట్టర్ వేదికగా వారి బండారం బయటపడిపోతుంది అని అంటున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు. అయితే ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ చేసే ప్రతి కార్యక్రమానికి అడ్డు వచ్చే తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై ట్విట్టర్ వేదికగా విజయసాయి రెడ్డి ఫైర్ అయ్యారు. 

 

అయితే అంతలా ఎందుకు అయ్యారు అంటే? సీఎం జగన్ పాదయాత్ర సమయం నుండే ప్రజలకు పక్క ఇల్ల గురించి చెప్తూ వచ్చారు. అయితే అధికారంలోకి వచ్చాక.. ఉగాది పండుగ సమయంలో పేదలకు ఇల్లు ఇస్తారు అని అయన చెప్పుకొచ్చారు. ఈ విషయానికి అయన 5 నెలల క్రితమే చెప్పారు. అయితే ఈ విషయంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి ఆరోజు పంచకుండా అడ్డుకున్నాడు అని విజయాసాయి రెడ్డి ఫైర్ అయ్యారు. 

 

విజయసాయి రెడ్డి ట్విట్ చేస్తూ.. ''ఉగాది రోజున పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని సిఎం జగన్ గారు 5 నెలల క్రితమే ప్రకటించారు. పట్టా డాక్యుమెంట్లు సిద్ధం చేయడం కూడా పూర్తయింది. పండుగ రోజున పేదలు సంతోషంగా ఉండటం ఇష్టం లేని బాబు పంపిణీ నిలిపేయాని కోర్టుకు వెళ్లాడు. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి అడ్డుకున్నాడు.'' అంటూ ట్విట్ చేశారు. 

 

కాగా.. కరోనా వైరస్ ప్రభావంతో ఏపీలో ఆరువారాల పాటు ఎన్నికలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల అధికారి రమేష్ కుమార్ వెల్లడించారు. ఆ సమయంలోనే అయన ఈ ట్విట్ చేశారు. వాయిదా పడ్డాయి కాబట్టి ఇల్ల పట్టాలు ఈ ఉగాదికి ఇస్తారా లేదా అనేది చూడాలి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: