సమాజం అంటే అన్ని కులాలు ఉంటాయి. ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ అభిమానించుకుంటూ సమిష్టిగా ముందుకు సాగాల్సివుంటుంది. ఏ ఒక్కరూ ఒంటరిగా బతకలేరు. ఎంత పెద్ద కులం వారైనా మిగిలిన వారి తోడూ నీడా కావాలి. అదే సమాజం గొప్పతనం.

 

మరి అటువంటి అందమైన సమాజంలో కులాల మధ్య చిచు పెట్టేందుకు రాజకీయ నాయకులు ఎప్పటికపుడు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. వాటిని తిప్పికొడుతూ అందరూ మళ్ళీ కలసిపోతున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే ఏపీ రాజకీయాల్లో కులాల చిచ్చు అలా ఇలా లేదు. దాన్ని రాజేసి రగిలించడంతో చంద్రబాబు ప్రధాన పాత్రలో కనిపిస్తారు.

 

ఆయన ఎంతగా కులాన్ని వాడుకుంటారంటే అవతలి పక్షాన్ని విమర్శించాలంటే అదే కులం వారికి మైకు ఇస్తారు. ఇక బాబు ఏ కులాన్ని నమ్మరు, అన్నింటినీ తన రాజకీయానికి నిచ్చెన మెట్లుగా వాడుకుంటారని కూడా అంటారు. అయితే మిగిలిన కులాలు నమ్మకపోయినా బాబు సొంత కులం కమ్మ వారు మాత్రం బాబుని నమ్మి రాజకీయంగా రచ్చ అవుతున్నారు.

 

బాబు జమానాలో కమ్మ వారు బాగుపడ్డారన్న అభిప్రాయం జనంలో ఉంది. కానీ అది కూడా కొందరికే. మిగిలిన వారు ఇతర కులాల వారిలాగానే ఉన్నారు. అయితే కమ్మ కులం వారిని ఇతర కులాలకు ఆ విధంగా బాబు కావాలని శత్రువులుగా చేసేశారు. ఇక కమ్మ అధికారులున్నారు. మిగిలిన అధికారుల మాదిరిగానే వారు కూడా ప్రతిభతో ఉద్యోగాలు సంపాదించుకుంటారు. 

 

అటువంటి వారిని కూడా తన రాజకీయానికి బాబు ఉపయోగించుకుంటారన్న ఆరోపణలు ఉన్నాయి. దాంతో వారు సైతం ఇబ్బందులు పడుతున్నారు. ఇక చంద్రబాబు జమానాలో కొందరిని రాజ్యాంగబద్ధ పదవుల్లో కూర్చోబెట్టారు. ఇపుడు వారు బాబుకు సలాం అనలేక, ప్రత్యర్ధి పార్టీకి జై కొట్టలేక సతమతమవుతున్నారు.

 

మొత్తానికి చూస్తే చంద్రబాబు, టీడీపీ రాజకీయాల వల్ల ఏపీలో ప్రధానమైన  కమ్మ కులం ఎంత లాభపడింతో తెలియదు కానీ మిగిలిన కులాల వారికి మాత్రం ఆ కులం అంటే అదో రకమైన ద్వేష భావం కలగడానికి బాబు ఆయన పార్టీ చేస్తున్న రాజకీయాలే కారణమని  అంటారు. 

 

ఇపుడు ఏపీలో ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకున్న ఎన్నికల వాయిదా నిర్ణయం వెనక బాబు ఉన్నారని ప్రచారం సాగుతోంది. దానికి మద్దతు ఇస్తూ బాబు స్టేట్మెంట్లు కూడా ఇవ్వడం ద్వారా నిమ్మగడ్డ విషయంలో వస్తున్న  ఆరోపణలు నిజాలు అని చెప్పకనే చెప్పేస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: