తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఎక్కువగా అనుసరించే ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి , కరోనా వైరస్ పై కూడా ఆయన తరహాలోనే వ్యాఖ్యలు చేయడం విమర్శలకు దారితీస్తోంది . కరోనాను చిన్న మందుబిళ్ల తో తగ్గించవచ్చునని జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పరిశీలిస్తే వారం రోజుల క్రితం అసెంబ్లీ వేదికగా కేసీఆర్ చేసినట్లుగానే ఉన్నాయి . అయితే ప్రపంచ దేశాల్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ తీవ్రతను గుర్తించిన కేసీఆర్ అత్యవసర  కేబినెట్ భేటీ ఏర్పాటు చేసి పలు కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెల్సిందే .

 

ఈ నెలాఖరు వరకు స్కూళ్ళు , కాలేజీలు , యూనివర్సిటీలు , కోచింగ్ సెంటర్లు ఒక్కటేమిటి అన్ని విద్యాసంస్థలు మూసి వేయాల్సిందేనని హుకుం జారీ చేశారు . చేయలేదంటే గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించారు . ఇక మాల్స్ , బార్లు , పబ్ లు , సినిమాథియేటర్లు కూడా మూసివేయాలన్న కేసీఆర్ , ఆర్ధికంగా రాష్ట్ర ఖజానా కు నష్టం వాటిల్లుతుందని తెలిసినా కూడా , ప్రజారోగ్యమే లక్ష్యంగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని  దాదాపుగా అన్ని వర్గాల వారు స్వాగతిస్తున్నారు . అయితే వారం రోజుల క్రితం  కరోనా వైరస్ అరికట్టేందు పారా సెట్ మాల్   వేసుకుంటే చాలు ...  27 డిగ్రీల  ఉష్ణోగ్రత లో ఆ వైరస్ బ్రతికే ఛాన్స్ లేదన్న కేసీఆర్ , అప్రమత్తమై అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటుంటే, ఇంకా జగన్మోహన్ రెడ్డి మాత్రం ... ఆయన గతం లో చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు వల్లవేయడం విమర్శలకు దారితీస్తోంది .

 

కరోనా కేసుల్లో 81 శాతం ఇంట్లో ఉండి రికవరీ అయ్యారని , కేవలం 13  శాతం  మంది మాత్రమే ఆసుపత్రుల్లో చేరారని జగన్మోహన్ రెడ్డి  పేర్కొనడం కూడా విమర్శకులకు ఆయన అవకాశం ఇచ్చినట్లయింది  . కరోనా విషయం లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందన్న జగన్మోహన్ రెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ లో 70  శాంపిల్స్ తీసుకుంటే ఒక్కటే పాజిటివ్ వచ్చిందని గుర్తు చేశారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: