తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు లో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రైతు బంధు పథకం పై మాట్లాడిన పాయింట్ చాలా న్యాయంగా ఉందని చాలామంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రైతు బంధు పథకం కింద తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న సాయం కొంత ఆలస్యం అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. పైగా ఈ పథకంలో కౌలు రైతులను ఫస్ట్ టైం పరిగణలోకి తీసుకోలేదు. అయితే ఇటీవల కొత్త పాస్ బుక్కులు వచ్చిన రైతులు ఈ పథకానికి అప్లై చేసుకున్న వాళ్లను లబ్ధిదారులుగా చేర్చడం లేదన్న విమర్శలు ఉన్నాయి. 70 శాతం భూమి యజమానులు రాష్ట్రంలో తమ భూములను కౌలు రైతులకు ఇచ్చారని ఈ సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్ చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ఖర్చు పెడుతున్న వేల కోట్ల రూపాయలు పొలంలో కష్టపడి పనిచేసే నిజమైన రైతులకు అందడం లేదని విమర్శించారు.

 

తనకు రైతు బంధు పథకం కింద మూడు లక్షల రూపాయలు వచ్చాయని, తనలాంటి వాళ్లకు ప్రభుత్వం సొమ్ము ఇవ్వటం అవసరమా అని రాజగోపాల్ ప్రశ్నించారు. అంతే కాకుండా రాష్ట్రంలో తన లాంటి వాళ్ళు చాలామంది లక్షల్లో ఉన్నారని ఆర్థికంగా మంచి స్థాయిలో ఉన్నవారికి ప్రభుత్వం డబ్బులు ఇస్తుందన్నారు. ప్రభుత్వ బంధు పథకం పెట్టిందే నిజమైన పేదలకు సాయం చేయటం కోసమని ఇలా తనలాంటి డబ్బున్న వాళ్లకు ప్రజాధనం పథకం రూపంలో ఇస్తే ఇక లాభం ఏముందని ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

 

అంతేకాకుండా పథకం కింద దానికి వచ్చిన మూడు లక్షల రూపాయలు డబ్బులను తన గ్రామంలో పేద రైతుల‌కు పంచిపెట్టాన‌నీ, త‌న‌లా ఎంతమంది చేస్తున్నార‌ని ప్ర‌శ్నించారు? రైతుబంధు అమ‌లుపై ప్ర‌భుత్వం పున‌రాలోచించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. దీంతో చాలామంది కోమటిరెడ్డి రాజగోపాల్ లేవనెత్తిన పాయింట్ చాలా కరెక్ట్ పాయింట్ అని...ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్న రైతులు...చాలామంది కౌలుకు తమ భూములను ఇచ్చేసి ఉంటారు, అంటే పెద్ద సంఖ్యలో కౌలు రైతులు క్షేత్రస్థాయిలో పని చేస్తుంటారు అటువంటి వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం డబ్బులు ఇస్తే బాగుంటుందని కోమటిరెడ్డి ఇచ్చిన సలహా న్యాయమైనది అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: