ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వల్ల చైనాలో చాలా మంది మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల భారత్ లో కూడా వ్యాపించిన కరోనా వ్యాప్తి రోజు రోజు తీవ్రంగా మారుతున్న సంగతి తెలిసిందే.. కరోనా వైరస్ ఎలా వస్తుంది అనేది తెలియకుండా ప్రజలు బిక్కు బిక్కు మంటూ బ్రతుకుతున్నారు.. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే పలు కేసులు కూడా నమోదు అయ్యాయి.. అయితే ఇప్పుడు యావత్ ప్రజలు కరోనా పై భయపడుతున్నారు ..

 

 

 

ఈ విషయం పై ఇప్పటికే కొందరు సెలెబ్రెటీలు ఈ కరోనా వైరస్ వ్యాప్తిపై పలు విధాల జాగ్రత్తలు చెబుతూ వస్తున్నారు.. ఉపాసన, విజయ్ దేవరకొండ, అమితాబ్ బచ్చన్ లు కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి తెలియ జేశారు.. చేతుల ద్వారా ఎటువంటి రోగమైన కూడా తొందరగా వ్యాప్తి చెందుతుంది కాబట్టి ఈ వ్యాధిని అరికట్టాలంటే ముందుగా చేతులను శుభ్రంగా ఉంచుకోవాలి.. అలాగే జలుబు దగ్గు లాంటివి ఉన్న వాళ్లకు దూరంగా ఉండాలని సూచించారు.. 

 

 


ఇకపోతే చైనాను మించిన విదంగా కరోనా వ్యాప్తి మరో దేశంలో ఎక్కువగా కనిపిసుంది.. ప్రపంచంలో ప్రఖ్యాత గల దేశం స్పెయిన్ లో ఈ వ్యాప్తి రోజురోజుకు పెరుగుతూ వస్తుంది.. అయితే, స్పెయిన్ లో కరోనా వ్యాపిస్తున్న తీరు అక్కడి ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తోంది. 24 గంటల వ్యవధిలోనే 2 వేల కొత్త కేసులు నమోదు కాగా, ఒక్కరోజులో 100 మంది ప్రాణాలు విడిచారు.

 

 

 

 ప్రస్తుతం స్పెయిన్ లో కరోనా బాధితుల సంఖ్య 7 వేలకు పైనే ఉంది. ఒక్కరోజులో పెద్ద సంఖ్యలో ప్రజలు మృతి చెందడం పట్ల స్పెయిన్ అధికార వర్గాలు మరింత అప్రమత్తం అయ్యాయి. ఫుట్ బాల్ లీగ్ లకు ఎంతో పేరుగాంచిన స్పెయిన్ లో ఇప్పుడే ఏ స్టేడియం చూసిన ఖాళీగా బోసిపోయినట్టు కనిపిస్తున్నాయి. ఏమని కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందో తెలియదు కానీ ఈ కరోనా వల్ల ఇప్పటికే దేశాల విల విల బోతున్నాయి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: