ఏంటి? ఏం చెప్తున్నారు ? అని ఆశ్చర్యపోతున్నారా? నిజం అండి బాబు. కరోనా వైరస్ బెడ్.. కరోనా చెప్పులు వేసుకుంటే కరోనా వైరస్ రాదంట. అవి ఎక్కడ? ఎందుకు అమ్ముతున్నారో తెలుసా? అదేం లేదు అండి. కరోనా వైరస్ ఎంత కఠినమైనది అయినా.. ప్రభుత్వాలు ఎంత సీరియస్ నిర్ణయాలు తీసుకున్న వ్యాపారులు మాత్రం వారి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునే ఆలోచనలోనే ఉన్నారు. 

 

ఇకపోతే.. ఈ కరోనా వైరస్ నియంత్రణకు అవసరమైన మాస్కులు, శానిటైజర్లను అమ్మే ప్రయత్నంలో బిజీగా ఉన్న వ్యాపారులు.. వాటిని నకిలీ చేసి అడ్డదారులు తొక్కే ఆలోచనలో కొందరు ఉన్నారు. ఇలా కరోనా వైరస్ పేరును ఎవరో ఒకరు అద్భుతంగా వాడేస్తున్నారు. ఆ కరోనా వైరస్ వల్ల ఎంతమంది చచ్చిన మాకు అనవసరం.. మా వ్యాపారం బాగా జరుగుతుంది అది చాలు అంటున్నారు. 

 

ఇంకా ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల్లో ఓ చెప్పుల షాపుకు కరోనా అని పేరు పెట్టారు. ఆ పేరును తీసుకొచ్చి కొందరు సోషల్ మీడియాలో పెట్టగా మొదట ఆశ్చర్య పోయినప్పటికీ.. తర్వాత మాత్రం నవ్వుకుంటున్నారు. ఈ చెప్పుల షాపు రాజమండ్రిలో ఏర్పాటు చేసినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. 

 

ఇంకా.. ముంబైలో అయితే మరి ఘోరం.. ఓ సంస్థ పరుపులను అమ్ముకోవడానికి కరోనా వైరస్‌ను వాడేసుకుంది. కరోనా వైరస్ కు ఇంకా మందే కనిపెట్టలేదు.. అలాంటిది వీళ్ళు వారి పరుపులు ''యాంటీ కరోనా వైరస్ మ్యాట్రెస్'' అంటూ పేపర్ లో ప్రకటన ఇచ్చారు. ఈ ప్రకటనను బోంబే సమాచార్ అనే పత్రికలో ప్రకటన ఇచ్చారు. ఈ ప్రకటన ప్రస్తుతం సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: