ఇంత ఫాస్ట్ జ‌న‌రేష‌న్‌లో కూడా ఇప్ప‌టికి కొంత మంది ఇళ్ళ‌ల్లో ఆడ‌పిల్ల‌ల‌కు ఆత్తింటి వేధింపులు త‌ప్ప‌డం లేదు అంటే ఆశ్చ‌ర్యంగా ఉంది. ప్ర‌స్తుతం జ‌న‌రేష‌న్ ఎంత ఫాస్ట్‌గా ఉంటుంది.  పెద్ద‌వారి మాట ఎవ్వ‌రూ వినే ప‌రిస్థితుల్లో లేరు. మ‌రి అలాంట‌ప్పుడు ఎలా ఆలోచిస్తున్నారు అంటే అందుకు స‌మాధానం దొర‌క‌డం లేదు. ఏ ఆడ‌పిల్ల‌కైనా ఒక‌సారి పెళ్ళైతే భ‌ర్తే స‌ర్వ‌స్వంగా భావిస్తారు. ఇంక ఆమెకు మంచి జ‌రుగు చెడు జ‌రుగు ఆమె భ‌ర్త‌తోనే ఉంటుంది. అలాగే భ‌ర్త కూడా ఆమె బాగోగుల‌న్నీ చూడాల్సిన  అవ‌స‌రం ఎంతైనా ఉంది. ఒక‌సారి పెళ్ళిచేసుకున్నాక ఇక ఆ అమ్మాయి ప్ర‌తి బాధ్య‌త భ‌ర్త‌కే సంబంధం ఉంటుంది త‌ప్పించి త‌ల్లిదండ్రుల‌కి ఎటువంటి సంబంధం ఉండ‌దు. ఏదో ఆడ‌పిల్ల పుట్టింటికి వెళ్లిందంటే ఏదో చుట్ట‌రిక‌పు చూపు త‌ప్పించి పెళ్ళైనా కూడా ఇంకా వాళ్ళ‌పైనా ఆధార‌ప‌డ‌డానికి కాదు.

 

మ‌రి అంత బాధ్య‌త లేని వాళ్ళు అస‌లు పెళ్ళి ఎందుకు చేసుకుంటారో కూడా అర్ధంకాదు. ఇలాంటి సంఘ‌ట‌నే ఒక‌టి బెంగుళూరులో చోటు చేసుకుంది. మంజునాధ నగర్‌లో నివాసం ఉండే కృష్ణ కుమార్, శరావతి దంపతుల కుమారుడు ధర్మానంద శర్మకు లక్ష్మీ శర్మ అనే యువతితో వివాహమైంది. ఇక పెళ్ళైన కొద్దికాలానికే ఆమెకి గుండెజబ్బు ఉన్నట్లు తెలియడంతో పిసినారి భర్త.. అత్తింటి వారు ఆమె ఆస్పత్రి ఖర్చులు పెట్టుకునేందుకు నిరాకరించారు. నీ జ‌బ్బుల‌తో మాకు ఎటువంటి సంబంధం లేదంటూ ఏమున్నా నీ పుట్టింటి నుంచే ఆస్పత్రి ఖర్చులకు డబ్బులు తీసుకురావాలని ఆమెను వేధించడం మొదలుపెట్టారు. 

 

దీంతో తీవ్ర మ‌న‌స్థాపానికి గురైనా స‌ద‌రు మ‌హిళ భ‌ర్తే కాద‌నుకున్న‌ప్పుడు ఇంకెవ‌రి కోసం బ్ర‌త‌కాలి అని నిర్ణ‌యించుకుని ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇక చనిపోయే ముందు లక్ష్మీ శర్మ సూసైడ్ లెటర్ రాసి పెట్టి బలవన్మరణానికి పాల్పడింది. అత్తింటి వేధింపులతోనే తాను చనిపోతున్నానని.. విడాకులు ఇవ్వాలంటూ తనను బెదిరింపులకు గురిచేస్తున్నారని రాసి పెట్టి ఆత్మహత్య చేసుకుంది. దీంతో భర్త, సహా అత్తమామాలను పోలీసులు అరెస్టు చేసి జైలుకి పంపారు. భర్త అంటే భ‌రించేవాడిలా ఉండాలి. భార్య‌లు కేవ‌లం త‌మ‌కి చాకిరి చెయ్య‌డానికి, లేదంటే పిల్ల‌ల‌ను క‌నివ్వ‌డానికి వ‌చ్చిన ఓ మిష‌న్ కాద‌న్న విష‌యం ఇప్ప‌టికి కొంత మంది మ‌గ‌వారు గ్ర‌హించ‌లేక‌పోతున్నారు. మ‌రి ఇలాంటి వారి కోసం కూడా ప్ర‌త్యేక చ‌ట్టాలు రావాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: