కరోనా వైరస్.. ప్రపంచాన్ని ఎంత దారుణంగా నాశనం చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ కరోనా వైరస్ చైనాలోని వుహాన్ నగరంలో పుట్టి ప్రపంచాన్ని వణికిస్తోంది. అలాంటి ఈ వైరస్ కారణంగా ఎంతోమంది ఆరోగ్యకరమైన జీవితాలు నాశనం అవుతున్నాయి. 

 

ఇకపోతే.. తాజాగా జరిగిన ఓ ఘటన కంటతడి పెట్టిస్తుంది. గుండెపోటుతో వచ్చి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న తన తండ్రిని చూడాలని ఎంతో తపనతో పక్క దేశం నుండి వచ్చిన ఓ యువకుడిని అధికారులు మధ్యలోనే ఆపేశారు. ఎందుకు అంటే? అతనికి కరోనా వైరస్ సోకింది. ఇంతలోనే అతని తండ్రి కన్నుమూశాడు. 

 

దీంతో.. అంతక్రియలకు కూడా వెళ్లలేక.. అతను కన్నీళ్లు దిగమింగుకుంటూచివరకు వీడియో కాల్‌లో తండ్రి చివరి చూపును చూశాడు. ఈ హృదయ విరదాకా ఘటన కేరళ రాష్ట్రంలో చోటు చేసుకుంది. కేరళ రాష్ట్రానికి చెందిన లినో అబెల్ ఖతర్‌లో దోహాలో పనిచేస్తున్నాడు. అయితే ఇటీవలే తండ్రికి గుండెపోటు రావడంతో 2020, మార్చి 08వ తేదీన బయల్దేరి భారత్ కు వచ్చాడు. 

 

అయితే ఎయిర్ పోర్టులో దిగగానే సిబ్బంది స్క్రినింగ్ పరీక్షలు నిర్వహించగా ఆ పరీక్షల్లో అతనికి కరోనా వైరస్ లక్షణాలు బయటపడ్డాయి. దీంతో అతన్నీ ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందించారు. మరుసటి రోజే తండ్రి మరణించాడు. ఈ విషయం తెలుసుకున్న అబెల్ కన్నీరుమున్నీరై ఏడ్చాడు. 

 

ఇక చివరి చూపు చూడాలి అని అనుకున్నాడు.. కానీ అంత్యక్రియలకు అతను బయటకు వెళ్తే అందరికి ఆ వైరస్ వ్యాప్తి చెందుతుంది అనే భయంతో వీడియో కాల్ లో తండ్రి చివరి చూపు చూశాడు. ఈ ఘటన చుసిన ఆసుపత్రి సిబ్బంది చలించిపోయారు. ఈ ఘటన అంత అతను సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యగా ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: