ప్రపంచం మొత్తం ఇప్పుడు ఎక్కడ చూసినా కరోనా కరోనా అన్న మాటే వినిపిస్తుంది.  ఇప్పటి వరకు కరోనా వల్ల 5 వేలకు పైగా మరణాలు సంబవించాయి.  చైనాలోని పుహాన్ లో ఈ వైరస్ పుట్టిన విషయం తెలిసిందే. అక్కడ పుట్టిన వైరస్ అతి కొద్ది రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది.   గత కొన్ని రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు తెలియని పుహాన్ గురించిన చర్చలే నడుస్తున్నాయి. వూహాన్.. ఈ పేరు తెలియనివారు ప్రపంచంలోనే ఎవరూ ఉండరనడం అతిశయోక్తి కాదేమో. ప్రస్తుతం ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా వైరస్ పురుడు పోసుకున్నది ఇక్కడే. ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ఉసురుతీసి, మరెంతో మందిని భయం కోరల్లోకి నెట్టేసిన వైరస్ ఉనికి ప్రారంభమైంది ఇక్కడే. 

 

లక్షకు పైగా ఈ వైరస్ భారిన పడ్డారు... ఇంకా ప్రజల్లో ఈ వైరస్ వణుకు పోలేదు. ఇప్పటి వరకు యాంటీడోస్ కనుగొనలేకపోయారు.  భారత్ లో ఈ ప్రభావం తో ఇప్పటికి ఇద్దరు చనిపోయిన విషయం తెలిసిందే. 80 కి పైగా ఈ వైరస్ భారన పడ్డట్టు లెక్కలు చెబుతున్నారు.  ప్రపంచాన్ని గడ గడలాంచిన కరోనా వైరస్ పుట్టిన పుహాన్ లో ఇప్పుడు అందరూ ఆశ్చర్యపోయేలా చేస్తున్నారు.  మొన్నటి వరకు ముఖానికి మాస్క్ లేకుంటే బయటకు రానివారు.. ఇప్పుడు మాస్క మాకు అవసరం లేదని చెబుతున్నారు. అక్కడ కొత్త కేసుల నమోదు పూర్తిగా ఆగిపోయింది. దీంతో ఇప్పటి వరకు నిర్బంధంలో హుబేయి ప్రావిన్స్‌లో జనం కళ్లలో మళ్లీ ఆనందం కనిపిస్తోంది.

 

ప్రభుత్వం తీసుకున్న కట్టదిట్టమైన చర్యల వల్ల వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట పడింది. దీంతో అక్కడ తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఆసుపత్రిని ప్రభుత్వం మూసివేసింది. ఇన్నాళ్లు భయపడ్డాం.. ఇక మాకు ఆ అవసరం లేదు.. అన్నట్లు చెబుతున్నారు. విజయ చిహ్నం చూపిస్తూ తమ సంతోషాన్ని బయటపెట్టారు. ఇప్పుడు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: