ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అనూహ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేశారు. ఎందుకయ్యా అంటే.. అమ్మో.. కరోనా కుమ్మేస్తోంది. ఈ ఎన్నికలు బతికి బాగుంటే ఎప్పుడైనా పెట్టుకోవచ్చు.. ముందు అర్జంటుగా జనం ప్రాణాలు కాపాడాలి అని చెప్పుకొచ్చారు. దీనిపై సీఎం జగన్ మొట్టమొదటిసారి ప్రెస్ మీట్ పెట్టి నిమ్మగడ్డ తీరును ఏకిపారేశారు. రాజ్యాంగబద్ద పదవిలో ఉన్న వ్యక్తి అని కూడా చూడకుండా చంద్రబాబు కులం వాడు కాబట్టే ఇలా చేశాడని అనేశారు.

 

 

 

అయితే.. జగన్ నుంచి ఈ తరహా దాడి ఊహించని నిమ్మగడ్డ సాయంత్రానికి వివరణతో ఓ ప్రెస్ నోట్ ఇచ్చారు. ఎన్నికల వాయిదాపై గవర్నర్‌కు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఫిర్యాదుచేయడం, విలేకరుల సమావేశం పెట్టి అనేక ప్రశ్నలు సంధించడంతో సాయంత్రం కల్లా ఎన్నికల కమిషనర్‌ రమేష్‌ కుమార్‌ వివరణ ఇచ్చారు. కరోనా వైరస్‌ సాకుగా చూపడం సరే.. ఆ విషయమై రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శితోగానీ, సీఎస్‌తో గానీ సంప్రదించారా.. పాటించాల్సిన ప్రొసీజర్స్‌ ఏమైనా పాటించారా అని ముఖ్యమంత్రి నిలదీశారు కదా.

 

 

 

అందుకు సమాధానంగా తాను కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులతో మాట్లాడినట్లు తన ప్రెస్ నోట్ లో తెలిపారు. మరి రాష్ట్రంలో కరోనా ఉంటే.. రాష్ట్ర అధికారులతో మాట మాత్రమైనా చెప్పకుండా అసలు రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో కనీసం అంచనా వేయకుండా.. ఇలా కేంద్ర అధికారులతో మాట్లాడానని చెప్పడం వెనుకే ఆయన ఉద్దేశ్యం ఏంటో అర్థమవుతుందంటున్నారు వైసీపీ నాయకులు. కరోనా వైరస్‌ అనేది ఓ సాకు మాత్రమేనని దీనిని బట్టి తెలిసిపోతోందని.. ఇంతకంటే వేరే ప్రూప్ ఎందుకని నిలదీస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: