'కరోనా వైరస్' కు ప్రపంచమే వణికిపోతోంది. ఎవరైనా షేక్ హ్యాండ్ ఇస్తే వెంటనే సబ్బుతోనో, శానిటైజర్ తోనో చేతులు కడుక్కోవాలని హెచ్చరిస్తున్నారు. కొంతమంది 'శానిటైజర్'ను దగ్గరుంచుకొంటున్నారు. చేతులు శుభ్రపరచుకుంటున్నారు. మెగాస్టార్ కు శానిటైజరుకు సంబంధం ఏమిటి? అనే ప్రస్తావనకు వస్తే.. ప్రజారాజ్యం పార్టీ స్థాపించాక.. ఎన్నికల్లో ప్రచారంలో అభిమాన హీరోను చూసేందుకు వచ్చి చిరంజీవికి ఎంతోమంది షేక్ హ్యాండ్స్ ఇచ్చేవారు.. చిరంజీవి చేతిని తాకే వారు. చిరంజీవి కూడా షేక్ హ్యాండ్స్ ఇచ్చేవారు.. వారి చేతుల్ని తాకేవారు. ఇది ప్రతిరోజూ కామన్ అయింది.

 

 

పర్యటన తర్వాత ఆయన వాహనంలో శానిటైజర్ తో చేతులు శుభ్రపరచుకునే వారు చిరంజీవి. చిరంజీవిని దెబ్బ తీయడానికే ఉన్న కొన్ని మీడియా సంస్థలు దీనిని నెగటివ్ వార్త చేసేశాయి. చిరంజీవి శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకుంటున్న ఫోటోను ఓ ప్రముఖ దినపత్రికలో ఏకంగా బాక్స్ ఐటమ్ వేసేశారు. అభిమానులను, ప్రజలను తాకిన చిరంజీవి చేతులు కడుక్కుంటున్న దృశ్యం అని. విషం కక్కే పత్రికలు, విషాన్ని వెదజల్లే కొంతమంది కుళ్లు రాజకీయ నాయకులు విష ప్రచారమే చేశారు. ఎవరికీ అవగాహన లేని రోజుల్లో ప్రజలు కూడా నమ్మారు.

 

 

కొన్ని చానెళ్లలో "అభిమానులంటే అంత హీనమా” అంటూ స్టోరీలు వేశారు. హెల్త్ కేర్, పరిశుభ్రత పట్ల చిరంజీవి ఎంత కేర్ గా ఉంటారో డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారే చెప్తూంటారు. అప్పట్లో ఆ విమర్శలను చిరంజీవి పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు.. 11 ఏళ్ల తర్వాత అదే నాయకులు, అవే విషపు పేపర్లు, టీవీలు కరోనా వైరస్ భయంతో... ‘శానిటైజర్ ను ఉపయోగించండి.. పరిశుభ్రత పాటించండి.. షేక్ హ్యాండ్ ఇవ్వకండి..’ అంటూ లెక్చర్లు దంచేస్తున్నారు. శానిటైజర్‌ ఉపయోగించడం నేరమూ, పాపమూ కాదని, అది కేవలం వ్యక్తిగత శుభ్రతకు, ముందస్తు జాగ్రత్తకు వాడేదేనని నీతి కబుర్లు చెప్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: