ప్రస్తుతం కరోనా  వైరస్ ప్రపంచ దేశాలను భయపెడుతున్న విషయం తెలిసిందే. చైనాలోని మహానగరంలో వెలుగులోకి వచ్చిన ఈ ప్రాణాంతకమైన వైరస్... ప్రస్తుతం చైనాలో కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ ఇతర దేశాలలో మాత్రం విజృంభిస్తోంది. ఇటలీ,   ఉత్తర కొరియా లాంటి దేశాలలో అయితే పరిస్థితి రోజు రోజుకు చేయి దాటి పోతుంది. ఇక మిగతా దేశాలలో కూడా ఇప్పుడిప్పుడే శర వేగంగా వ్యాప్తి చెందుతుంది ఈ ప్రాణాంతకమైన వైరస్. అయితే ఈ కరోనా  వైరస్ ప్రభావం ఇటలీ దేశంలో తీవ్ర స్థాయిలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ప్రాణాంతకమైన వైరస్ బారినపడి 1,300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే వాస్తవానికి అయితే జనవరి నెలలోనే ఇటలీ దేశంలో కరోనా వైరస్ గుర్తించారు. ఇక కరోనా  వైరస్ గుర్తించిన అప్పటి నుంచే ఇటలీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. 

 

 

 కానీ ఇటలీ ప్రభుత్వం చేసిన ఒక చిన్న పొరపాటు కారణంగా... అక్కడ కరోనా వైరస్ విజృంభణ కారణమైంది. ప్రస్తుతం ఎంతో మంది ప్రాణాలను బలితీసుకుంది. అయితే జనవరి నెలలో మొదట ఇటలీ దేశంలో రెండు కరోనా  పాజిటివ్ కేసులు నమోదు అయిన వెంటనే... ఇటలీ ప్రభుత్వం ఆరు నెలల పాటు ఎమర్జెన్సీని ప్రకటించింది. ఈ క్రమంలోనే చైనా దేశంలో కరోనా  వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో చైనా నుండి ఇటలీకి  వచ్చే విమానాలన్నింటి నిషేధించింది ఇటలీ ప్రభుత్వం. ఇలా ఉంటే ఫిబ్రవరి 18వ తేదీన గూడూరు పట్టణంలో మరో కరోనా  కేసు నమోదైంది. అయితే ఆ వ్యక్తికీ కరోనా  లక్షణాలు ఉన్నప్పటికీ ఇది సాధారణ ఫ్లూ గానే అక్కడి డాక్టర్లు భావించారు. 

 

 

కరోనా  వైరస్ లక్షణాలు ఉన్న సదరు వ్యక్తికి ప్రత్యేకంగా ఐసోలేషన్ వార్డులో పెట్టి చికిత్స అందించకుండా... కేవలం సాదా సీదా చికిత్స చేసి ఇంటికి పంపించేశారు. ఇక ఆ తర్వాత పది రోజుల వ్యవధిలోనే ఏకంగా పదుల సంఖ్యలో కరోనా వైరస్ బాధితులు  ఆస్పత్రిలో చేరడం గమనార్హం. దీంతో గతంలో ఫ్లూ  సోకింది అనుకున్న వ్యక్తి కి కరోనా సోకింది అని  వైద్యులు అర్థం చేసుకునే లోపే పరిస్థితి చేజారిపోయింది. ఫిబ్రవరి 23న కరోనా  వైరస్ కారణంగా ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా... ఇటలీ  ప్రభుత్వం మరింత అప్రమత్తమై పోయింది. ఇటలీలోని పట్టణాలను ఎక్కడికక్కడ దిగ్బంధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. తర్వాత ఇటలీ దేశాన్ని మొత్తం దిగ్బంధం విధిస్తూ  ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంటే గతంలో  కరోనా వైరస్ లక్షణాలతో ఆసుపత్రికి వచ్చిన వ్యక్తికి వైద్య పరీక్షలు నిర్వహించి కరోనా  ఉందని  నిర్దారిస్తే  సరిపోయేదని కానీ వైద్యులు  చేసిన ఆ చిన్న తప్పు కారణంగా ప్రస్తుతం విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ విశ్లేషకులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: