గత ఏడాది రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోరమైన పరాజయం తర్వాత వరుసగా దెబ్బ మీద దెబ్బ పడేసరికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నీ కోల్పోయినవాడిలా కుదేలై పోయాడు. అయితే ఇప్పుడు చాలా రోజుల తర్వాత బాబు ముఖంలో మళ్ళీ చిరునవ్వు విరిసింది.

 

ఏపీ లో మూడు రాజధానుల విషయంలో ప్రభుత్వానికి శాసన మండలి ద్వారా జగన్ కు గట్టి దెబ్బ వేసిన చంద్రబాబు అప్పుడు కూడా ఇంత ఆనందంగా లేడని అందరూ అంటున్నారువిషయం ఏమిటంటే ఎన్నికల కమిషన్ రాష్ట్రం లో జరగవలసిన స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్న తర్వాత బాబు అంత ఆనందంగా ఎవ్వరూ కనిపించడంలేదు.

 

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ రాష్ట్రంలో అక్కడక్కడా కనిపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు తీసుకొన్న నిర్ణయం తెలుగుదేశం పార్టీలో ఫుల్ జోష్ నింపింది. ఇప్పటికే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చాలామంది పై దాడులు జరిగి వారిని నామినేషన్లు వేయకుండా వైసిపి కార్యకర్తలు ఎన్నికలను పలు చోట్లా ఏకగ్రీవం చేశారు అని ఆరోపణలు వినిపిస్తున్న సమయంలో ఇలా జరగడం మరియు దానిను జగన్ విపరీతంగా ఖండించడం బాబుకు ఎక్కడలేని ఆనందాన్ని ఇస్తుంది.

 

ఇకపోతే టిడిపి పార్టీకి చెందిన ఇతర నేతలు బాబు తో సహా సంబరాలు చేసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా ఎంపీ కేశినేని నాని కరోనా భయమా? ఓటమి జ్వరమా? అంటూ ఒక పోస్ట్ వేశారు. అలాగే మాజీ మంత్రి దేవినేని ఉమ కూడా ప్రభుత్వం కరోనా పట్ల వ్యవహరిస్తున్న నిర్లక్ష్యం పట్ల విమర్శలు చేశారు. అధికార పార్టీ దౌర్జన్యం చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల్లో నామినేషన్లు వేయలేకపోవడంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, వార్డులు ఏకగ్రీవమయ్యాయని, ప్రాంతాల్లో తిరిగి ఎన్నికల ప్రక్రియ నిర్వహించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

 

దీనిపై న్యాయపోరాటం చేస్తున్న తెలుగు దేశం పార్టీ కోర్టు తీర్పుకోసం ఎదురు చూస్తోంది. ముఖ్యంగా గుంటూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో జరిగిన సంఘటనలు, నామినేషన్లు చింపి వేసిన వీడియోలను తెదేపా తరుపున న్యాయవాదులు కోర్టుకు అందజేశారు. న్యాయం కూడా వారి వైపే ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: