ఈ మద్య దొంగలు చాలా తెలివి నేర్చారు.. తాము చేసే పని మూడో కంటికి తెలియకుండా.. సింపుల్ గా కానిచ్చేస్తున్నారు.  మరికొంత మంది సైబర్ నేరగాళ్లు గురించి కూర్చున్న చోటే హ్యక్ చేస్తూ కోట్లు కొల్లగొడుతున్నారు.  అదేదో చిత్రంలో చెప్పినట్లు ఇప్పుడు యుద్దాలు చేయాల్సిన అవసరం లేదు.. టెక్నాలజీ ఉంటే చాలు.. మనిషి పతనం ఇట్టే అయిపోతుందని హీరో అంటాడు. నిజంగానే టెక్నాలజీ వచ్చిన తర్వాత సైబర్ నేరగాళ్ల సంఖ్య బాగా పెరిగిపోయిన విషయం తెలిసిందే.  ఆర్థిక వ్యవస్థలో కూడా ఈ సైబర్ నేరగాళ్లు తమ ప్రతాపాన్ని చూపిస్తున్న విషయం తెలిసిందే.  మరోవైపు గన్ కల్చర్ కూడా బాగా పెరిగిపోతుంది. ఒకప్పుడు గన్ వాడాలంటే భయపడేవారు.. ఇప్పుడు బొమ్మ తుపాకీల్లా వాడుతున్నారు. 

 

చిన్న చిన్న నేరగాళ్ల వద్ద కూడా ఖరైదైనా గన్స్ ఉంటున్నాయి.  తాజాగా నోయిడాలోని ఓ వ్యక్తికి దిమ్మ తిరిగే షాక్ తగిలింది. మార్గమధ్యంలో మూత్ర విసర్జన కోసం రిషభ్ అరోరా అనే స్టాక్ బ్రోకర్ కారు నుంచి కిందకు దిగాడు. అంతే తిరిగి వచ్చేసరికి తన  బీఎండబ్యూ కారు మాయం చేశారు. నోయిడా సెక్టార్ 90లోని ఫేజ్-2 పోటీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.  తాను ఓ పార్టీకి వెళ్లి రాత్రి సమయంలో వస్తుండగా ఇద్దరు వ్యక్తులు బైక్ పై వచ్చి తన కారు వద్ద ఆగి తనను గన్ తో బెదిరించి కారును తీసుకెళ్లారని పేర్కొన్నారు.

 

ఈ నేపథ్యంలో, అరోరా పేర్కొన్న విషయాలను కూడా నిర్ధారించుకునే పనిలో పోలీసులు ఉన్నారు. ఎందుకంటే ఆ సమయంలో ఆయన అతిగా మద్యం సేవించి ఉన్నాడు.  దీనిపై పోలీసులు మాట్లాడుతూ.. ఈ కారు అరోరా బావమరిదికి సంబంధించినదని.. ఆయన ఈ కారుపై ఫైనాన్సియల్ గా రూ. 40 లక్షలు పెండింగ్ ఉందని... బహుషా కారు యజమానికి తెలిసిన వ్యక్తులే ఈ పని చేసి ఉంటారని అన్నారు. ఏది ఏమైనా కారు ఎక్కడ ఉన్న విషయం కనిపెడతామని వారు అన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: