కరోనా మహమ్మారి బారిన ప్రజలు పడకుండా ప్రభుత్వాలు అన్ని విద్యా సంస్థలకు సెలవలు ఇచ్చేసినా కొంతమంది మాత్రం ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. స్కూళ్ళు, ఆఫీసులు, ప్రైవేటు కార్యాలయాలు వంటి చోట్ల వైరస్ చాలా వేగంగా సోకే ప్రమాదం ఉన్నందున ప్రభుత్వం వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఛాన్స్ తీసుకోలేదు. అందుకే తెలంగాణ ప్రభుత్వం ముందస్తు చర్యగా మార్చి 31 దాకా సెలవులు ప్రకటించి అన్ని విద్యా సంస్థలను మూసివేయాలని కోరారు. కానీ కొన్ని విద్యాసంస్థలు మాత్రం వారి మాటలను పెడచెవిన పెట్టాయి.

 

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అదే పని గా ప్రెస్ మీట్ పెట్టి మరీ అన్ని విద్యా సంస్థలకు ఆదేశాలు జారీ చేసినప్పటికీ వారు ఇలా వ్యవహరించడంతో తాజాగా విద్యార్థి తల్లి తెలంగాణ మంత్రి కేటీఆర్ కు ఇదే విషయమై సోషల్ మీడియాలో ఫిర్యాదు చేశారు దీనికి స్పందించిన కేసీఆర్ వెంటనే స్కూళ్ళు మరియు కాలేజీలపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నీ విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన యథేచ్ఛగా స్కూలు మరియు కాలేజీ  హదరాబాద్ లో నడుస్తున్న తీరుని మంత్రి దృష్టికి తీసుకువెళ్లిన అనన్య చౌదరి అనే ఒక మహిళ ఇప్పుడు అక్రమంగా నడుస్తున్న వాటిన్నింటిపై పై చర్యలు తీసుకోవాలని కోరారు.

 

విషయం తెలిసిన వెంటనే కేటీఆర్ తీవ్రమైన ఆగ్రహానికి లోనయి వెంటనే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దృష్టికి తీసుకొని పోయి రాష్ట్రంలో అలాంటి అన్ని విద్యాసంస్థలను మూసివేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం గా మారింది. ర్యాంకుల కోసం కాకుండా విద్యార్థుల ఆరోగ్యం కోసం విద్యాసంస్థలు మూసివేయాలని కోరారు. వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

 

కేటీఆర్ ఆదేశాల తో విద్యాశాఖ రంగంలోకి దిగింది. విద్యాసంస్థల లైసెన్స్ రద్దు చేయడానికి సిద్ధమైంది. వాటిపై చర్యలకు ఉపక్రమించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: