స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జగన్ పార్టీలోకి తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు వరుసగా క్యూ కడుతున్నారు. ఇప్పటికే చాలా మంది రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రముఖ నాయకులు జగన్ సమక్షంలో కండువా కప్పుకోవడం జరిగింది. దీంతో తల పట్టుకుంటున్న చంద్రబాబు కి తాజాగా మరో ఒక సీనియర్ నాయకుడు మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి వైసీపీ పార్టీలోకి రావడానికి సిద్ధమయ్యారు. రాజకీయాలలో ఎంతో అనుభవం ఉన్న గద్దె వెంకటరెడ్డి తెలుగుదేశం పార్టీలో కీలకంగా రాణించారు. దీంతో అటువంటి అనుభవం ఉన్న రాజకీయ నేత తన పార్టీలో ఉంటే చాలా మంచిదని జగన్ తన సన్నిహితులతో కబురు పెట్టించి మరి గద్దె వెంకటరెడ్డిని తన పార్టీలో చేర్చుకోవడానికి ప్రయత్నాలు చేశారట.

 

దీంతో తెలుగుదేశం పార్టీలో ఉన్న చాలా మంది ప్రముఖ నాయకులను ఒక్కొక్కరిని చంద్రబాబు కి దూరం చేసి చంద్రబాబుని ఏకాకి చేయాలని స్థానిక ఎన్నికల లోపు అదే జరగాలని జగన్ ప్రస్తుతం ప్లాన్ వేస్తున్నారు అని వైసీపీ పార్టీలో టాక్. పర్చూర్ నియోజకవర్గానికి చెందిన గాదె వెంకటరెడ్డి 1991లో పర్చూర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాష్ట్ర మంత్రిగా పగ్గాలు చేపట్టారు. 2004 ఎన్నికల సమయంలో డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు దంపతులు కాంగ్రెస్ లో చేరడంతో నాటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గాదెను బాపట్ల కు మార్చి పోటీచేయించారు.

 

గాదె వరుసగా బాపట్ల నుంచి 2004, 2009 ఎన్నికల్లో గెలుపొందారు. ఆ తర్వాత రాష్ట్రం విడిపోయాక మొట్టమొదటిసారి మిగిలి ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2014 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ మరియు వైసీపీ పార్టీ తరఫున టికెట్ కోసం ప్రయత్నాలు చేసి ఫెయిలయ్యారు. ప్రస్తుతం గద్దె వెంకటరెడ్డి కుమారుడు వైసిపి లో చేరటానికి రెడీ అయ్యారు. ఇదే తరుణంలో మరికొంతమంది తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు నాయకులు కూడా జాయిన్ అవ్వు బోతున్నట్లు సమాచారం.  

మరింత సమాచారం తెలుసుకోండి: