caa చట్టం 2019ని సవరించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఈ తీర్మానానికి ఎమ్ ఐఎమ్, కాంగ్రెస్ మద్దతు పలికితే... bjp వ్యతిరేకించింది. 

 

బడ్జెట్ సమావేశాల చివరి రోజు... caa చట్టం 2019ని సవరించాలని తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. caa, NRC, NPRపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని cm kcr తేల్చి చెప్పారు. caa చట్ట సవరణ తర్వాత దేశంలో జరుగుతున్న పరిణామాలపై ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేశారు. ముస్లింలను మినహాయించడం రాజ్యాంగ విరుద్ధమని, తాము లేవనెత్తిన సందేహాలను కేంద్రం నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు... KCR. ఇది హిందువులు, ముస్లింల సమస్య కాదని...దేశ సమస్య అని అన్నారు కేసీఆర్.

 

దేశాన్ని కలిపి ఉంచే చట్టాలు కావాలి తప్ప విభజించే చట్టాలు వద్దన్నారు... mim పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ. NPRను నిలిపివేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని, CAAను సవాల్‌ చేస్తూ... సర్కారు, సుప్రీంకోర్టును ఆశ్రయించాలని డిమాండ్ చేశారు ఓవైసీ. తీర్మానం చేసినందుకు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.

 


ఇక కాంగ్రెస్‌ పక్ష నేత భట్టి విక్రమార్క... తనతో పాటు తన సహచర ఎమ్మెల్యేలకు కూడా బర్త్ సర్టిఫికెట్లు లేవన్నారు. caa, NPR, NRC... బడుగు, బలహీన వర్గాలను ఇబ్బంది పెడతాయన్నారు... భట్టి. NPRను నిలిపివేస్తూ కేరళ ప్రభుత్వంలా తెలంగాణ సర్కారు కూడా ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు భట్టి విక్రమార్క.

 

తీర్మానాన్ని వ్యతిరేకించారు... బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్. caa వల్ల ఏ ఒక్కరికి ఇబ్బంది కలిగినా mla పదవికి రాజీనామా చేస్తానని... తెలంగాణ విడిచి వెళ్లిపోతానని చెప్పారు. అసెంబ్లీలో తీర్మానం ప్రతులను చించివేశారు... రాజా సింగ్. మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీలో సీఏఏ చట్టాన్ని సవరించాలని తీర్మానం చేసి ఆమోదం తెలిపింది. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: