ఇన్నాళ్లూ కరోనా అనే సమస్య మనదాక రాలేదు కాబట్టి యదేచ్చగా ఉన్నాము.. కానీ ఇప్పుడు అదే సమస్యతో సతమతం అవుతున్నాము.. అందువల్ల ఈ వ్యాధిని అరికట్టే వాక్సిన్స్ లేని సందర్భంలో కరోనాను అదుపుచేయడం ఒక్కటే మార్గంగా భావించి తగుచర్యలను దాదాపుగా అన్ని రాష్ట్రాలు తీసుకుని అమలు చేస్తున్నాయి.. ఈ క్రమంలో కొంత ఆర్ధిక వ్యవస్ద అస్దవ్యస్దంగా మారినా ప్రజల ప్రాణాలు ముఖ్యం కాబట్టి.. ఇప్పటికే కొన్ని సంస్దలు మూసివేయగా, మరికొన్ని వర్క్ ఫ్రం హోం అనే విధానన్ని ప్రవేశ పెట్టాయి.. ఇదే కాకుండా ఈ నెలాఖరు వరకు స్కూళ్లు, సినిమా హాళ్లు, ఎమ్యూజ్‌మెంట్‌ పార్కులు, పబ్బులు, బార్లను  మూసివేయాలని కూడా ప్రభుత్వం  ఆదేశించింది..

 

 

ఇలా ఈ కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకునే విధానాన్ని కొందరు ఖాతారు చేయకుండా ఇష్టారీతిగా ప్రవర్తిస్తున్నారట.. ఇలా తెలంగాణ ప్రభుత్వం దాదాపు అన్నిసంస్దలకు సెలవులు ఇచ్చినా, కొన్ని విద్యాసంస్థలు మాత్రం ఈ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నాయట. ఈ విద్యాసంస్దలు ఇలా ప్రవర్తించడం వల్ల విద్యార్ధులు అనారోగ్యానికి గురైతే దానికి బాధ్యత ఎవరు వహిస్తారు..

 

 

అసలే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినవి ఓ హోళి సెలవులో, దసరా సెలవులో అంటే ఇలా చాటుమాటుగా స్కూళ్లూ నడిపించిన ఏం కాదు.. కానీ ఇది ఆరోగ్య సమస్య.. తేడా వస్తే ప్రాణాలకే ప్రమాదం.. ఇక ఈ విద్యా సంవత్సరంలో స్కూళ్లకు విపరీతంగా సెలవులు వచ్చి విద్యార్ధులు తీవ్రంగా నష్టపోయారు.. అసలే ఆ మధ్యకాలంలో టీఎస్ఆర్టీసీ చేసిన ఘనకార్యం వల్ల అన్ని విద్యాసంస్దలు సెలవులు ఇచ్చాయి.. అప్పుడే ఇంతలా ఆలోచించని పాఠశాలల యజమాన్యాలు, ఈ అత్యవసర హెల్త్ ఎమర్జెన్సీ సమయంలో ఇలా వ్యవహరించడం మాత్రం సమంజసం కాదు అని చాలా మంది అనుకుంటున్నారట..

 

 

ఇక సాక్షాత్తు తెలంగాణ సీయం కేసీఆర్ అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించినా గాని కొందరు పెడచెవిన పెట్టడంతో చిన్న బాసు కోపం నషాళానికి అంటి వెంటనే ఇలాంటి స్కూళ్లు, కాలేజీల పై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో కేటీఆర్ ఆదేశాలతో విద్యాశాఖ రంగంలోకి దిగి, ఆ విద్యాసంస్థల లైసెన్స్ రద్దు చేయడానికి సిద్ధమైంది... అంతే కదండీ పనికి రాని విషయాల్లో బందులు పాటించే వారు, ఇలాంటి అత్యవసర పరిస్దితుల్లో మాత్రం ఆదేశాలు పాటించకుండా ఏం సాదిద్దామని దొంగచాటుగా స్కూళ్లు నడిపిస్తున్నారో అర్ధం కావడం లేదు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: