వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.. ఇప్పుడు ఈయన సోషల్ మీడియా వేదికగా ఒక వివాదానికి తెర లేపారు. ఆర్జీవీ అంటేనే వివాదాలు.. వివాదాలంటేనే ఆర్జీవీ ఈ విషయం తెలిసిందే.. ఈయనకు నీళ్లు, తిండి లేకపోయినా పరవాలేదు కానీ.. వివాదాలు లేకుండా మాత్రం ఉండలేడు. ఏదొక విధంగా ఏదో విషయానికి సోషల్ మీడియాలో చర్చలను జరుపుతుంటారు. కానీ.. ఈయన ఏ వివాదాన్నయినా సోషల్ మీడియా ద్వారానే షేర్ చేస్తారు. అయితే.. ఇప్పుడు ఒక వివాదాన్ని సోషల్ మీడియా ద్వారా రామ్ గోపాల్ వర్మ పంచుకున్నాడు. ఆయన ఏ విషయానికైనా మీడియా ద్వారానే స్పందిస్తాడు. 


ఆయన సోషల్ మీడియా ద్వారా పంచుకుంది ఏంటంటే.. ది రోట్వేలేర్ - ది న్యూ ఫౌండ్ ల్యాండ్ అనే రెండు జాతుల పెంపుడు కుక్కలు ఉన్నాయి. అందులో ఒకటి పీకేఎఫ్ - సీబీఎన్ ఎఫ్ - ఎల్బిఎఫ్ ల నుండి రక్షించడానికి ప్రొటెక్షన్ గా పెట్టుకున్నట్లుగా ఉంది అందులో ఉన్న మ్యాటర్ లో.. అయితే దాంట్లో మరి 'ఎఫ్' అంటే అర్ధం ఏంటి అనేది తన అభిమానులకు, నెటిజన్లకు మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. కాగా., మీ ఇష్టం ఉన్నట్లు అనుకోండి అని వదిలేశాడు ఆర్జీవీ. ఈయన ఎంత మొండి మనిషి అనేది దీన్ని బట్టి మనకు అర్ధమవుతోంది. అయితే.. ఈ పోస్ట్ చదివిన ప్రతి ఒక్క నెటిజన్ పీకేఎఫ్ అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని - సీబీఎన్ ఎఫ్ అంటే చంద్రబాబు నాయుడు ఫ్యాన్స్ అని - ఎల్బిఎఫ్ అంటే లోకేష్ బాబు ఫ్యాన్స్ అని అనుకుంటున్నారు మరి. మరి ఆర్జీవీ ఏం అనుకుంటున్నాడో.. అయన వ్యూ పాయింట్ ఆఫ్ లో ఏముందో ఎవ్వరికి తెలియదు.


మరి నెటిజన్లు అడిగే దానికైనా రామ్ గోపాల్ వర్మ చెప్తాడా..?? లేదా అనేది చూద్దాం మరి. కొంతమంది నెటిజన్లు అయితే.. అసలు ఆర్జీవీ కి బుర్ర ఉందా.. లేదా.. బుర్ర ఉంటే ఇలాంటి పోస్ట్ లు పెడతారా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.    

మరింత సమాచారం తెలుసుకోండి: