కమ్మ వారు ఏపీలో అత్యంత డామినేటింగ్ రోల్ ప్లే చేసే సామాజికవర్గం. వారు అన్ని రంగాల్లో మొదటి స్థానంలోనే ఉన్నారు. రాజకీయ రంగంలో అయితే గత నాలుగు దశాబ్దాలుగా ఫోర్ ఫ్రంట్ లో  ఉన్నారు. అటువంటి కమ్మ  అస్థిత్వానికి గత రెండేళ్ళుగా ఇబ్బంది ఎదురవుతోంది. చంద్రబాబు నాయకత్వాన టీడీపీ పరాజయం పాలు కావడంతో రాజకీయ ఉనికికే గండి పడినట్లుగా ఉంది.

 

ఇక ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చారు.   అలా ఇలా కాకుండా ఏకంగా 151 సీట్లతో అజేయంగా జగన్ అధికారం చేపట్టారు, చిత్రమేంటంటే ఏపీలో జగన్ రాజకీయంగా అధికారంలో ఉండడం సాంకేతికంగానే  ఉంది. వ్యవస్థల‌న్నింటా కమ్మ వారు ఇంకా డామినేటింగ్ రోల్ ప్లే చేస్తూనే ఉన్నారు.

 

జగన్ సైతం అధికారంలోకి రావడంతోనే అమరావతి రాజధాని వద్దన్నారు, అలాగే వారి వ్యాపారాలను దెబ్బతీసేలా మద్య నిషేధం అమలు, సర్కార్ బడుల్లో ఇంగ్లీష్ మీడియం. ఇసుక కొత్త పాలసీ, రియల్ బూం తగ్గేలా చర్యలు ఇవన్నీ వెరసి కమ్మ సామాజికవర్గం అభద్రతాభావంతో ఉందని అంటున్నారు.

 

ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్ ఏకంగా కులం పేరు ఎత్తి ఆ సామాజికవర్గాన్ని తరచూ టార్గెట్ చేయడం కూడా వారిని మండుకొస్తోంది. తాజాగా రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి విషయంలో కూడా జగన్ ఆయన కులాన్ని ప్రస్తావించడంతో కమ్మవారు ఓ లెక్కన ఫైర్ అవుతున్నారు.

 

దీని మీద టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గోరంట్ల  బుచ్చయ్యచౌదరి అయితే మమ్మల్ని చంపేయ్యండి  అంటూ దారుణమైన కామెంట్స్ చేశారు. మా జోలికి వస్తే జగన్ పతనం మొదలవుతుందని కూడా హెచ్చరిస్తున్నారు. కేవలం ఒక సామాజికవర్గాన్ని టార్గెట్ చేస్తున్నారని విరుచుకుపడుతున్నారు.

 

మరో వైపు ఇంతకంటే వాడిగా వేడిగా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర చౌదరి కూడా జగన్ మీద విమర్శలు చేశారు. మా వారితో కలసి వ్యాపారాలు, రాజకీయాలు చేయడానికి బాగుంటుంది కానీ అనవసర  విషయాల్లో  మాత్రం మమ్మల్నే టార్గెట్ చేస్తున్నారు. ఎంతవరకూ సమంజసమని నిలదీస్తున్నారు.

 

జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టింది కమ్మ వారు కాదా అని, అపుడు మేము మంచి వాళ్ళమా, పనికి వచ్చామా అంటూ కస్సుమంటున్నారు. మొత్తం కులం కుంపట్ల మీద రాజకీయాలు సాగే ఏపీలో కమ్మవారు ఇపుడు ఒక్కసారిగా ఆవేశంతో ముందుకు వస్తున్నారు. దీని పరిణామాలు ఎలా ఉంటాయో వేచి  చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: