కరోనా వైరస్ హుబె ప్రావిన్స్ లో నవంబర్ సెకండ్ వీక్ లో మొదలయ్యి మెల్లిగా ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది.   హుబె ప్రావిన్స్ లోని వుహాన్ నగరానికి పరిమితమైన కరోనా వైరస్ ఆ తరువాత వరసగా ప్రపంచవ్యాప్తం అయ్యింది.  రెండు నెలల తరువాత కరోనా వైరస్ చైనాలో మెల్లిగా తగ్గడం మొదలుపెట్టింది.  ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఎక్కడికి వెళ్లినా కరోనా ముచ్చట్లే నడుస్తున్నాయి.  వైరస్‌కు గురైన వారికి చికిత్స అందించడం కోసం కేవలం 10 రోజుల్లో తాత్కాలిక ఆస్పత్రి నిర్మించడం లాంటివి ఈ చర్యలు తీసుకున్నాయి. ఆ తర్వాత చైనాలో ఈ వైరస్ నియంత్రణలోకి వస్తున్నట్లు కనిపించింది. కానీ మిగతా ప్రపంచమంతటా ఈ మహమ్మారి రెండు వారాల్లో వ్యాపించింది.  ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఇప్పటి వరకు 145 దేశాలకు విస్తరించింది.

 

చైనాలో మొదలైన ఈ వైరస్ అక్కడ కాస్త అదుపులోకి వచ్చినా యూరప్ దేశాలకు బాగా విస్తరించి భయపెడుతోందని సాక్షాత్తు ఐక్యరాజ్య సమితి ప్రకటించడం గమనార్హం. వూహాన్.. ఈ పేరు తెలియనివారు ప్రపంచంలోనే ఎవరూ ఉండరనడం అతిశయోక్తి కాదేమో. ప్రస్తుతం ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా వైరస్ పురుడు పోసుకున్నది ఇక్కడే.  అక్కడ కొత్త కేసుల నమోదు పూర్తిగా ఆగిపోయింది. దీంతో ఇప్పటి వరకు నిర్బంధంలో వున్న హుబేయి ప్రావిన్స్‌లో జనం కళ్లలో మళ్లీ ఆనందం కనిపిస్తోంది. ప్రభుత్వం తీసుకున్న కట్టుదిట్టమైన చర్యల వల్ల వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట పడింది.

 

అంతా బాగుందీ అనకున్న సమయంలో ఇప్పుడు చైనాకు కొత్త టెన్షన్ మొదలైందట.  రికవరీ అయ్యితిరిగి వెళ్లిన కొంతమందికి తిరిగి  జలుబు, జ్వరం వంటివి రావడంతో హాస్పిటల్ కు తిరిగి వస్తున్నారట.  అలా వచ్చిన వాళ్లకు టెస్ట్ చేస్తే కరోనా పాజిటివ్ ఉన్నట్టుగా తేలింది.  దీంతో చైనాకు కొత్త తలనొప్పులు ప్రారంభం అయ్యాయి.  ఇంటికి వెళ్లిన వాళ్లలో 14శాతం మంది కరోనా పాజిటివ్ తో తిరిగి హాస్పిటల్ కు వస్తున్నట్టు పేర్కొన్నది.  ఈ ప్రస్తుతం ఈ ప్రావిన్స్ లోనే ఇలాంటి కేసులు ఉంటున్నాయని, మిగతా ప్రాంతాల్లో కూడా ఇది జరిగే అవకాశం ఉన్నట్టుగా ఆ సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పేర్కొన్నది.  జియాంగ్సు, సిచువాన్ ప్రావిన్స్ లో కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నట్టుగా కథనంలో పేర్కొన్నది.  

మరింత సమాచారం తెలుసుకోండి: