ఏపీఐఐసీ చైర్మన్, వైసీపీ ఎమ్మెల్యే రోజాపై టీడీపీ సీనీయర్ నేత బోండా ఉమా మహేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా రోజాపై విమర్శలు చేశారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు నిన్న ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనను తొలుత సమర్థించిన రోజా ఆ తరువాత విమర్శలు చేశారు. 
 
రోజా అరగంటలో మాట మార్చడంపై బోండా ఉమ " అబ్బబ్బబ్బబ్బా... రోజా ఆంటీ డబల్ యాక్షన్ ఇలాంటి పర్ఫార్మెన్స్ నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్..." అంటూ విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలతో పాటు రోజా మాట్లాడిన వీడియో క్లిప్పింగ్ లను బోండా ఉమ జత చేశారు. ప్రముఖ న్యూస్ ఛానెల్ రోజా అరగంటలోనే మాట మార్చారని ఒక వార్తా కథనాన్ని ప్రసారం చేసింది. 
 
రోజా నాలుక మడతబెట్టారని రెండు సందర్భాల్లోను చేసిన వ్యాఖ్యలను పదే పదే చూపిస్తూ టీవీ ఛానల్ టెలికాస్ట్ చేసింది. మొదట రోజా మీడియాతో ప్రజల ఆరోగ్యాన్ని, శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసిందని ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని ఆమె సమర్థించారు. ఆ తరువాత వైసీపీ ఈసీ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించటంతో రోజా మాట మార్చారు. 
 
మొదట ఈసీ నిర్ణయాలను మెచ్చుకున్న రోజా చంద్రబాబు రిటైర్ అయిన వ్యక్తిని ఎన్నికల కమిషనర్ గా నియమించారని అన్నారు. చంద్రబాబు ప్రస్తుతం స్థానిక ఎన్నికలు జరిగితే ఓడిపోతామని భావించి ఎన్నికలు తన మనిషితో వాయిదా వేయించారని అన్నారు. ఎన్నికల కమిషనర్ ప్రభుత్వంతో, సీఎంతో, ఉన్నతాధికారులతో ఎటువంటి చర్చలు జరపకుండా ఎన్నికలు వాయిదా వేయడం ఏమిటని ప్రశ్నించారు.                   

మరింత సమాచారం తెలుసుకోండి: