స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైసీపీ ఆపరేషన్ దిగ్విజయంగా కొనసాగుతుంది. వరుస పెట్టి టీడీపీ నేతలు వైసీపీ కండువా కప్పేసుకుంటున్నారు. ఎన్నికలు ఆరు వారాలు వాయిదా పడిన, ఈ వలసలు మాత్రం ఆగట్లేదు. రోజు ఎవరోకరు వైసీపీ తీర్ధం పుచ్చుకుంటూనే ఉన్నారు. అయితే వైసీపీ కూడా ఎవరిని పడితే వారిని చేర్చుకోవడం లేదు. వారి వల్ల పార్టీకి ఉపయోగం ఉంటుందనుకుంటేనే చేర్చుకుంటున్నారు. ఇప్పటివరకు చూసుకుంటే పలు జిల్లాల్లో ఉన్న బడా నేతలని పార్టీలో చేర్చుకున్నారు.

 

అయితే దాదాపు అన్నీ జిల్లాల్లో నేతలు క్యూ కట్టి వైసీపీలోకి వస్తున్న, నెల్లూరు జిల్లాలో ఉన్న తెలుగు తమ్ముళ్ళు మాత్రం పెద్దగా వైసీపీలో చేరుతున్నట్లు కనిపించడం లేదు. ఇటు వైసీపీ కూడా నెల్లూరు తమ్ముళ్ళపై పెద్దగా ఫోకస్ చేసినట్లు కూడా కనపడటం లేదు. ఎందుకంటే ఇక్కడ తమ్ముళ్ళ వల్ల వైసీపీకి పెద్దగా ఉపయోగం ఉన్నట్లు కనిపించడం లేదు. జిల్లా ఎలాగో ఎప్పుడు వైసీపీకి కంచుకోటగానే ఉంటుంది. మొన్న ఎన్నికల్లో కూడా జిల్లాలో ఉన్న 10 అసెంబ్లీ, సీట్లు, ఒక ఎంపీ సీటుని కైవసం చేసుకుంది.

 

ఇక ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా 80 శాతంపైనే ఫలితాలు తెచ్చుకునే అవకాశముంది. దీంతో అధికార వైసీపీ నెల్లూరు తమ్ముళ్ళతో పెద్దగా పని లేదు అనుకుంటుంది. కాకపోతే వైసీపీకి కంచుకోటగా ఉన్న కడప జిల్లాలో కూడా కొందరు టీడీపీ వాళ్ళని చేర్చుకున్నారు. అయితే వారు బాగా పవర్‌ఫుల్ నాయకులు కాబట్టి చేర్చుకున్నట్లు తెలుస్తోంది. కడప మాదిరిగా నెల్లూరు జిల్లా టీడీపీలో పవర్‌ఫుల్ నాయకులు అని చెప్పుకోవడానికి ఒక్క reddy SOMIREDDY' target='_blank' title='సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తప్ప పెద్దగా ఎవరు లేరు.

 

పైగా సోమిరెడ్డి కూడా గత నాలుగు పర్యాయాలుగా ఓడిపోతూ వస్తున్నారు. దీంతో ఈయన వల్ల కూడా ఒరిగేదేమీ లేదు. అలాగే జిల్లా అధ్యక్షుడు బీదా రవిచంద్ర యాదవ్‌కు కూడా జిల్లాపై పెద్దగా పట్టులేదు. ఏదేమైనా నెల్లూరు తమ్ముళ్ళుతో పెద్దగా ఉపయోగం లేదనిపిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: