ప్రపంచంలో ఎక్కడా లేని కులగజ్జి ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుందని నానుడు ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా ఇంటికి వెళితే కచ్చితంగా వాళ్లు మర్యాద చేస్తారు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం మీ క్యాస్ట్ ఏంటి అని అడుగుతారు అనే టాక్ తెలుగు రాష్ట్రాలలో ఉంది. కులానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంత విలువ ఇస్తారో...ఆ విధంగా ప్రపంచంలో మరొకరు ఏ ప్రజలు కూడా ఇవరని చాలామంది అంటారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ కులాని బేస్ చేసుకుని జరుగుతాయి. ముఖ్యంగా రెడ్డి మరియు కమ్మ సామాజిక వర్గం మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. రాజకీయాలను పెంచి పోషించడంలో ఈ రెండు సామాజిక వర్గాలకు చెందిన రాజకీయ నాయకులకు మించిన వారు మరొకరు ఉండరని చాలామంది అంటుంటారు. కులాని విడగొట్టి రాజకీయాలు చేయాలన్నా కులాల మధ్య గొడవలు పెట్టాలి అన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రాజకీయ నేతలను మించిన వారు మరొకరు ఉండరు అని చాలామంది అంటారు. కుల ప్రాతిపదికన జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రాన్ని దివాలా చేసే విధంగా ఉన్నాయి. విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎన్నికయ్యారు.

 

ఆ తర్వాత జగన్ ప్రస్తుతం ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో రెడ్డి మరియు కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు నేతలు కులాన్ని ఆధారం చేసుకుని ప్రస్తుతం రాజకీయాలు వ్యవహరిస్తున్నారని విమర్శలు భయంకరంగా వినబడుతున్నాయి. ప్రస్తుతం ఏపీలో ‘టీడీపీ వర్సెస్‌ వైపీపీ’ కాస్తా ‘కమ్మ వర్సెస్‌ రెడ్డి’ అన్నట్లు తయారైంది. విషయంలోకి వెళితే ఇటీవల ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఒక బాధ్యతగల పదవిలో ఉండి...విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధుల విషయంలో అడ్డం కలిగించే విధంగా వ్యవహరించారని దానికి కారణం చంద్రబాబు అని సీఎం జగన్ విమర్శించారు. స్థానిక ఎన్నికలు వాయిదా వేయటం అదికూడా coronavirus పేరు చెప్పి దురదృష్టకరమని పేర్కొన్నారు.

 

సొంతంగా నిర్ణయాలు తీసుకొని ఎవరికీ చెప్పకుండా ఎన్నికల వాయిదా వేయటం ఏంటి అని ప్రశ్నించారు. ఇదంతా చంద్రబాబు ప్లాన్ లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహరిస్తున్నారని ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్లని ఆరోపించారు. దీంతో ఒక బాధ్యతగల ముఖ్యమంత్రి అయి ఉండి వైయస్ జగన్...సీనియర్ ఐఏఎస్ అధికారి కులం పై మాట్లాడటం దురదృష్టకరమని జగన్ కామెంట్ల పై విమర్శలు వస్తున్నాయి. ఏమైనా ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు రెడ్డి వర్సెస్ కమ్మ అన్నట్టు మారి పోయి రాష్ట్రాన్ని అట్టర్ ప్లాప్ దిశగా వెళ్తున్నాయని విమర్శలు బయటనుండి వినబడుతున్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: