కరోనా వైరస్ ధాటికి ప్రపంచమంతా చిగురుటాకులా వణికిపోతోంది .  చైనా లో మొదలైన ఈ వైరస్, ఇప్పుడు ప్రపంచం లోని 140 దేశాలకు పైగా విస్తరించింది .  కరోనా వైరస్ వల్ల ఆరోగ్య అత్యవసర పరిస్థితే కాకుండా , ఆర్ధిక అత్యవసర పరిస్థితి నెలకొంది . కరోనా వైరస్ దెబ్బ ప్రపంచ మార్కెట్లు కుదేలయ్యాయి . స్టాక్ మార్కెట్లు భారీ పతనాన్ని చవి చూస్తున్నాయి  . కరోనా వైరస్ దెబ్బకు గత వందేళ్లలో ఎప్పుడు చూడనంత భారీ నష్టాన్ని మార్కెట్లు చవి చూడాల్సిన పరిస్థితులు నెలకొంటాయని ఆర్ధిక నిపుణులు అంచనా వేస్తున్నారు .

 

కరోనా వల్ల ఇప్పటి వరకు ప్రపంచ దేశాలకు  ఏకంగా 750 లక్షల కోట్ల మేరకు  నష్టం వాటిల్లి ఉంటుందని పేర్కొంటున్నారు . కరోనా వైరస్ వల్ల ఒకవైపు మరణ మృదంగం మోగుతుండడంతోపాటు , ఆర్ధిక వ్యవస్థలు పతనమవుతుండడం తో అన్ని దేశాలు తలలు పట్టుకుంటున్నాయి . ఇక ఈ వైరస్ ప్రభావాన్ని కట్టడి చేసేందుకు ఇప్పటికే అన్ని దేశాలు హెల్త్ ఎమర్జెన్సీని  ప్రకటించాయి . అదే సమయం లో ఆర్ధిక అత్యవసర పరిస్థితిని కూడా అంచనా వేస్తున్నాయి .  దేశం లోను   కేంద్ర ప్రభుత్వం, హెల్త్ ఎమర్జెన్సీ ని ప్రకటించిన విషయం తెల్సిందే . విదేశీ టూరిస్ట్ లు వీసాలను నియంత్రించిన కేంద్రం , వచ్చే నెల 15  వరకు వాణిజ్య వీసాలను కూడా కట్టడి చేసింది .

 

ఒకవిధంగా చెప్పాలంటే విదేశీ ప్రయాణికులు దేశం లో అడుగుపెట్టకుండా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నాన్ని చేస్తోంది . విదేశాలకు వెళ్లి వచ్చిన వారి వల్లే ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం వల్లే కేంద్ర ప్రభుత్వం ఈ తరహా చర్యలు తీసుకుంటుందన్నది నిర్వివాదాంశం . అయితే కరోనా ను కట్టడి చేసేందుకు తీసుకుంటున్న ఈ ముందస్తు చర్యలే మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయనడం లో సందేహం లేదు  . అయితే ఒక్క మనదేశం లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది . 

మరింత సమాచారం తెలుసుకోండి: