ఏపీలో లోకల్ బాడీ ఎన్నికలే సార్వత్రిక ఎన్నికలను మించిపోయాయి. దీనితో ముఖ్యమంత్రి కుర్చీ ఏదో పట్టేద్దామన్నంతగా విపక్ష  పార్టీలు హడావుడి చేశాయి. జగన్ని అచ్చంగా దింపేశామన్నట్లుగా ఎన్నికల వాయిదాను కూడా సంబరం చేసుకున్నాయి. మరి లోకల్ బాడీ ఎన్నికల్లో జగన్ని కట్టడి చేయలేక చివరికి వాయిదా మంత్రాన్ని జపించాయి. ఇపుడు ఏకంగా
ఎన్నికలు రద్దు, వద్దు అంటున్నాయి.

 

లోకల్ ఎన్నికల గొడవ ఒక విషయం స్పష్టంగా చెబుతోంది. ఏపీలోని పార్టీలన్నీ కలసినా జగన్ని ఏమీ చేయలేవని. జగన్ అపరిమితమైన బలంతో ఉన్నారు. ప్రజాదరణలోనూ జగన్ కి ఎవరూ సరిసాటి రారు. మరో వైపు జగన్ సంక్షేమ పధకాలు వరసగా ప్రవేశపెడుతున్నారు. దీంతో ఆయనకే మళ్ళీ మళ్ళీ జనం ఓటేస్తారని కూడా బాబు వంటి ఉద్ధండ పిండానికే అర్ధమయ్యాక ఇక మిగిలిన చిన్నా చితక పార్టీల సంగతి చెప్పక్కర్లేదు.

 

లోకల్ బాడీ ఎన్నికల్లో తొంబై శాతం సీట్లు జగన్ పరం అయితే ఆయన పార్టీకి  మంచి పునాదులు క్షేత్ర స్థాయి నుండి పడతాయి. అదే సమయంలో టీడీపీ పునాదులు కదిలిపోతాయి. మిగిలిన పార్టీలు తోక పాటీలుగాగానే మిగిలిపోతాయి. సరిగ్గా ఈ భయంతోనే అన్ని పార్టీలు కలసి స్థానిక ఎన్నికల మీద చేయాల్సిన రచ్చ అంతా చేశాయి. ఇపుడు అంతా కూడబలుక్కుని ఎన్నికలే వద్దు అనేదాకా వచ్చేశాయి.

 

నిజంగా విపక్షానికి ఎన్నికలు కావాలి. అధికార పక్షానికి ఎన్నికలు వద్దు అన్న మాట నోట  రావాలి. కానీ ఇక్కడ సీన్ రివర్స్. ఎన్నికలు ఎలా తప్పించాలా. తాము ఎలా తప్పించుకోవాలా అని ప్రతిపక్షాలు ఎపుడైతే చూస్తున్నాయో అక్కడే అవి ఓడిపోయాయని అంటున్నారు. ఈ ఎన్నికలు ఎదుర్కోలేని విపక్షాలు రేపటి రోజున సాధారణ ఎన్నికలు ఎలా ఎదుర్కొంటాయో కూడా చెప్పాలని అంటున్నారు.

 


అప్పటికి జగన్ మరిన్ని పధకాలు ప్రవేశపెట్టి ఇంకా బలవంతుడిగా మారిపోతారు.  దీన్ని బట్టి చూస్తూంటే ఏపీలో అన్ని పార్టీలకు జగన్ శత్రువు. జగన్ కావాలనుకునే వారు ఆయనకే ఓటు చేస్తారు. వద్దు అనుకునే ఓట్లే విపక్షం పంచుకోవాలి. మొత్తం మీద 2024లో కూడా జగన్ హీరో అని, మరో మారు సీఎం అని ఏపీలోని విపక్ష రాజకీయం చెప్పకనే చెప్పేస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: