నారా లోకేశ్.. రాజకీయాల్లో కొన్ని సార్లు చాలా గడ్డు పరిస్థితి వస్తుంది.. ఏం చేసినా కలసి రాదు.. ప్రస్తుతం నారా లోకేశ్ పరిస్థితి అంతే.. చంద్రబాబు తర్వాత తెలుగు దేశాధినేత ఆయనే. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే చంద్రబాబు తప్పుకుని లోకేశ్ నే సీఎం చేసే ఆలోచన కూడా ఉందని అన్నారు. కానీ పాపం.. లోకేశ్ కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయారు.

 

 

ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన మొదటి సారే ఓటమి చవి చూశారు. దీంతో అందరికీ పలుచన అయ్యారు. అంతకు ముందు ఎమ్మెల్సీగా నెగ్గినా.. అదో విజయం కానే కాదు. పరోక్ష ఎన్నిక కాబట్టి ఎమ్మెల్యేల సంఖ్య ఉంటే చాలు.. ఆటోమేటిగ్గా పార్టీ చెప్పినవాళ్లే గెలుస్తారు. అయితే ఇప్పుడు నారా లోకేశ్ కు మరోసారి ఎన్నికల బరిలో నిలిచే అవకాశం వచ్చింది. అది కూడా ఓ వైసీపీ మంత్రి సవాల్ విసురుతున్నారు.

 

 

వైయస్ఆర్‌సీపీ పాలన బాగోలేదంటున్న చంద్రబాబు.. నారా లోకేష్‌ను ఎంపీటీసీగా పోటీ చేయించాలని వైసీపీ మంత్రి పేర్ని నాని సవాల్ విసిరారు. స్థానిక ఎన్నికలు వాయిదా పడినా.. మరో రెండు నెలల్లో అయినా ఎన్నికలు జరుగుతాయి కదా.. అప్పుడు నారా లోకేశ్ ను ఎంపీటీసీగా పోటీ చేసి గెలిపించుకోవాలని చంద్రబాబుకు పేర్ని సవాల్ విసిరారు. మరి ఈ సవాల్ ను టీడీపీ స్వీకరిస్తుందా..?

 

 

బహుశా ఈ సవాల్ ను టీడీపీ పట్టించుకోకపోవచ్చు. పేర్ని నాని ఇంకా ఏమన్నారంటే.." బీజేపీ, జనసేన, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు.. టీడీపీ తోక పార్టీలుగా మారొద్దుయయ కరోనా ప్రభావముంటే నామినేషన్‌ సమయంలో టీడీపీ నేతలు ఎందుకు మాస్క్‌లు ధరించలేదు. రాజధాని గ్రామాల్లో టెంట్లు వేసి ఎందుకు ఆందోళన చేస్తున్నారు.. గవర్నర్, డీజీపీ, సీఎస్ కుర్చీలకు విలువ లేకుండా చేసిందీ టీడీపీ అధినేత చంద్రబాబేనని పేర్ని విమర్శించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: