ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా వల్ల మనుషుల జీవన విధానం పూర్తిగా మారిపోతుంది.. ఇప్పటికే ఆర్ధికంగా సతమతం అవుతున్న మధ్యతరగతి మనిషికి ఈ కరోనా కోలుకోలేని విధంగా తయారవుతుంది.. ఇప్పటికే దేశవ్యాప్తంగా కరోనా వైరస్ అందరినీ వణికిస్తోంది. రోజు రోజుకు తన పంజా విసురుతున్న దీని భారిన పడే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది.. ఇప్పటికే భారత్‌లో కరోనా బాధితుల సంఖ్య 116కు పెరిగింది. ఇదిలా ఉండగా కరోనా పాజిటివ్‌ కేసులు మహారాష్ట్రలో ఆందోళన కలిగించే స్థాయిలో నమోదు అవుతున్నాయి. కాగా తాజాగా ఆ రాష్ట్రంలో 39 మంది కరోనా వైరస్‌ బారిన పడినట్లుగా అక్కడి వైద్యులు ధ్రువీకరించారు.

 

 

ఇక ఒక్క ముంబైలోనే 14 మందికి కరోనా పాజిటివ్‌ అని తేలింది.. ఇకపోతే కరోనా వ్యాప్తిలో భాగంగా మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో 114 సెక్షన్‌ విధించారు. నగరంలో ఎలాంటి ర్యాలీలు, సమావేశాలు, సభలు పెట్టరాదని పోలీస్‌ జాయింట్‌ కమిషనర్‌ రవీంద్ర కందం ప్రజలను, నాయకులను కోరారు. ఇక రాష్ట్రంలోని ఏ పట్టణాన్ని, నగరాన్ని నిర్బంధంలో ఉంచాలన్న ఉద్దేశం తమకు లేదని మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌ ఠాక్రే తెలిపారు.. కరోనా వైరస్‌ను ఎక్కువగా వ్యాపించకుండా చేపట్టే నివారణ చర్యల్లో ప్రజలు భాగస్వాములు కావాలని, అందువల్ల ప్రజలు ప్రభుత్వంతో కలిసి పని చేయాలంటూ తెలిపారు.. ఇక రానున్న 15 నుంచి 20 రోజులు చాలా కీలమైనవని, ఇప్పటి వరకు ప్రజారవాణా ఆంక్షలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. ఆందోళనకర పరిస్థితి తలెత్తినప్పుడు తప్పక ఇలాంటి ఆంక్షలపై సమీక్షిస్తామని పేర్కొన్నారు..

 

 

ఇదిలా ఉండగా కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో కూడా సీఎం కేజ్రీవాల్ ఆంక్షలు విధించారు. ఇందులో భాగంగా వీలైనంతగా ప్రజలు గుంపులు గుంపులుగా ఉండకుడదని, జనసమూహం ఒకచోట చేరే ఎలాంటి సమావేశాలు కానీ, ఫంక్షన్లు కానీ ఎక్కడా నిర్వహించరాదని ఆదేశించారు. నెలాఖరు వరకూ జిమ్ లు, నైట్ క్లబ్ లు, స్పా లను కూడా మూసివేయాలని కోరారు... ఇదే కాకుండా దాదాపుగా అన్ని రాష్ట్రాలు ఇలాంటి నిబంధనలు అమలు చేస్తున్నాయి.. ఇక ఈ వేసవిలో కరోనాను అరికట్టకపోతే రానున్న, వర్షకాలం, చలికాలంలో మరింతగా ఈ వైరస్ విజృంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి..  

మరింత సమాచారం తెలుసుకోండి: