ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది కొత్త దర్శకులు వచ్చి తమ సత్తా చాటుతున్నారు. తమదైన శైలిలో దర్శకత్వం వహిస్తూ ఎన్నో సినిమాలను తెరకెక్కించి మంచి విజయాలను అందుకుంటున్నారు . కొంతమంది బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కూడా కురిపిస్తున్నారు. ఇలా స్టార్ డైరెక్టర్గా ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది దర్శకులు కొనసాగుతున్నారు. అయితే ఎంతోమంది దర్శకులు వచ్చినప్పటికీ ఆ ఒక్క దర్శకుడి క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. టాలీవుడ్ నెంబర్వన్ దర్శకుడిగా ప్రస్తుతం టాప్ ప్లేస్ లో  దూసుకుపోతున్నాడు ఆ దర్శకుడు. చేసిన ప్రతి సినిమా ని బ్లాక్ బస్టర్ విజయం మారుస్తూ .. ఓటమెరుగని దర్శకుడిగా ప్రస్తుతం టాలీవుడ్ లో ఒక రేంజ్ లో ఉన్నాడు. ఇంతకీ ఆ దర్శకుడెవరు ఒక ఇప్పటికే అర్థమయి ఉంటుంది.. ఆ దర్శకుడు ఎవరో కాదు ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతూ... తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని  ప్రపంచం నలుమూలలా వ్యాపింపజేసిన దర్శక ధీరుడు రాజమౌళి. 

 

 

 రాజమౌళి ఏ  సినిమాను తెరకెక్కించినప్పటికీ ఆ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.ఎన్నో  సినిమాలను  తెరకెక్కిస్తున్నప్పటికీ ఆయన సినిమాలు  ఎక్కడా బోర్ కొట్టదు ప్రేక్షకులకు. ఎన్ని సినిమాలు తెరకెక్కించిన అంచనాలు తగ్గలేదు . రాజమౌళి సినిమాల్లో ఏదో మ్యాజిక్ ఉంది... ప్రేక్షకులందరినీ థియేటర్లో కన్నార్పకుండా చూసేలా తెరకెక్కించే నైపుణ్యం ఉంటుంది రాజమౌళి దర్శకత్వంలో. అందుకే నేమో  దశాబ్దాలు గడిచిపోతున్నప్పటికీ ఆ దర్శకుడు మేనియా మాత్రం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎక్కడా తగ్గడం లేదు. అప్పుడప్పుడు తెరకెక్కించిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా నుంచి మొన్నటికి మొన్న తెరకెక్కించిన బాహుబలి సినిమా వరకు... ఇక ఇప్పుడు తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్  సినిమాపై కూడా ప్రేక్షకుల్లో అంచనాలు ఎక్కడా తగ్గడం లేదు. 

 

 

 శిల్పి జక్కన చెక్కిన శిల్పాలన్ని  అపురూపం అయినట్లు.. దర్శక ధీరుడు జక్కన్న చెక్కిన సినిమాలన్నీ తెలుగు ఖ్యాతిని  ప్రపంచం నలుమూలలా వ్యాప్తి చేస్తున్నాయి. ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి సినిమా వస్తుందంటే కేవలం తెలుగు చిత్ర పరిశ్రమ ప్రేక్షకులే కాదు... మొత్తం భారత సినీ ఇండస్ట్రీతో పాటు... విదేశీ సినీ ఇండస్ట్రీ కూడా వెయ్యి కళ్లతో ఎదురు చూసేలా తెలుగు సినిమా ఖ్యాతిని పెంచాడు దర్శక ధీరుడు రాజమౌళి. దశాబ్దాలు గడుస్తున్నప్పటికీ ఆ దర్శకుడి ని క్రేజ్   మాత్రం ఇప్పటికీ తగ్గడం లేదు. ఏ సినిమా తెరకెక్కించిన అందులో మ్యాజిక్ క్రియేట్ చేస్తూ సంచలన విజయాలను అందుకుంటున్నాడు రాజమౌళి.

మరింత సమాచారం తెలుసుకోండి: