ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ బాధితుల సంఖ్య 1,75,000కు చేరింది. నిన్నటివరకు కరోనా భారీన పడి 7,007 మంది మృతి చెందారు. చైనాలో అత్యధికంగా 3,213 మంది ఈ వైరస్ కారణంగా చనిపోయారు. చైనా తరువాత ఇటలీలో 2,158 మంది కరోనా భారీన పడి మృతి చెందారు. ఇటలీ దేశంలో ఇప్పటివరకు 28,000 కరోనా కేసులు నమోదయ్యాయి. మన దేశంలో 114 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా ఒడిశా రాష్ట్రంలో తొలి కరోనా కేసు నమోదైంది. 
 
దేశవ్యాప్తంగా కరోనా భారీన పడి ఇప్పటికే ఇద్దరు చనిపోయారు. కరోనా వైరస్ ప్రభావంతో అమెజాన్ కు ఆన్ లైన్ ఆర్డర్లు పెరుగుతున్నాయి. చైనాలో అమెజాన్ దాదాపు లక్ష మంది కొత్త వర్కర్లను నియమించుకోనుందని తెలుస్తోంది. న్యూజిలాండ్ దేశంలో ఆర్థిక మాంద్యం పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో 7.31 బిలియన్ డాలర్లను ఖర్చు చేయాలని నిర్ణయించింది. 
 
కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో అమెరికా, ఫ్రాన్స్ ప్రభుత్వాలు సంచలన నిర్ణయాలు తీసుకున్నాయి. ఫ్రాన్స్ ఆ దేశపు ప్రజలను 15 రోజుల వరకు ఇళ్లకే పరిమితం కావాలని సూచించింది. ప్రతి ఒక్కరూ ఈ రూల్ పాటించాలని లేకపోతే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అమెరికాలో కరోనా భారీన పడి ఇప్పటికే 80 మంది చనిపోయారు. 
 
అమెరికాలో కరోనా బాధితుల సంఖ్య 4,300కు చేరింది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనాను అదుపులోకి తీసుకొనిరావడం కొరకు ఆంక్షలు విధించింది. ప్రజలు గుంపులుగా ఎక్కడికీ వెళ్లవద్దని సూచించింది. కరోనా ప్రభావంతో అమెరికా ఆర్థిక వ్యవస్థ కూడా మందగమనంలోకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.                          

మరింత సమాచారం తెలుసుకోండి: