ఇప్పుడు ప్రపంచం మొత్తంలో ఒక్కటే టాక్ నడుస్తుంది.. అదే కరోనా.  చైనాను నుంచి దిగుమతి అయిన అత్యంత భయంకరమైన కరోనా వైరస్ తో జనాలకు కంటిమీద కునుకు లేకుండా పోతుంది.  ఇది ఎంతగా ఎవరైనా దగ్గినా... తుమ్మినా అతనేదో నేరం చేసిన వారిలా చూస్తున్నారు.  ఎందుకంటే కరోనా ఎఫెక్ట్ తో దగ్గు, తుమ్ములు, జ్వరం తర్వాత ఊపిరి తిత్తులు సరిగా పనిచేయకపోవడం శ్వాస ఇబ్బందితో మరణిస్తారు. ఇలా కరోనా ఎఫెక్ట్ తో ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికీ 5 వేల మందికి పైగా మరణాలు సంబవించాయి.  భారత దేశంలో ఇప్పుడు కరోనా కేసులు 128 కి చేరాయి.  దాంతో ఇక్కడ కరోనా కు సంబంధించి జాగ్రత్తలు మరింత ఎక్కువ అయ్యాయి.

 

మరోవైపు కరోనా ధాటికి తట్టుకోలేక పాఠశాలలు,కాలేజీలు, మాల్స్, థియేటర్లు, బార్లు, క్లబ్బులు, స్విమ్మింగ్ ఫూల్స్, పార్కులు అన్నీ మూసి వేశారు.  తాజాగా ముంబైలోని జుహూ ప్రాంతంలో ఉన్న ఇస్కాన్ మందిరం సిబ్బంది చేసిన నిర్వాకం ఇప్పుడు విమర్శలకు దారితీసింది. మందిరంలో శానిటైజర్ అయిపోయిందన్న కారణంతో, గోమూత్రంతో అక్కడికి వచ్చిన భక్తుల చేతులు శుభ్రం చేశారు. ఇస్కాన్ పరిధిలో ఉన్న గోవిందా రెస్టారెంట్ వద్ద. దీంతో పలువురు తీవ్ర విమర్శలు చేశారు.   

 

రాజూ నాయర్ అనే వ్యక్తి తనకు ఎదురైన అనుభవాన్నిచెప్పడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.  ఇస్కాన్ టెంపుల్ లోపల ఉన్న గోవిందా రెస్టారెంట్‌కు రాజూ నాయర్ వెళ్లాడు.  అక్కడ అతన్ని తనిఖీలు చేసి సిబ్బంది ఆ తరువాత చేతులు చూపాలని కోరారు. రెండు చేతులు చూపగానే ఏదో స్ప్రే చేశారు. సాధారణంగా  స్ప్రే ఎలాంటి దుర్వాసన రాదు.. కానీ వారు అప్లై చేసిన  స్ప్రే ఏదో దుర్వాసనలా నిపించిందని..  ఏంటని ప్రశ్నించగా గోమూత్రం స్పే చేశామని దానితో చేతులు శుభ్రం చేసుకోవాలన్నారు. దీనితో విస్తుపోయిన అతడు ఇదేం పద్దతి అని మండపడ్డారు. ఈ ఘటన బయటకు రావడంతో విమర్శలు వ్యక్తం అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: