భారత ప్రదాన మంత్రి గా నరేంద్ర మోదీ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.  ఈ నిర్ణయాల్లో ముఖ్యమైనది పెద్దనోట్ల మార్పు.  రూ. 500, రూ.2000 వేల నోట్లు అమల్లోకి తీసుకు వచ్చారు.  పాత నోట్ల చెలామణి రద్దు చేశారు. అప్పట్లో కొన్ని ఇబ్బందులు పడ్డా తర్వాత జనాలు అలవాటు పడ్డారు.  అయితే ఈ మద్య రూ. 2000 వేల నోటు మళ్లీ రద్దు అవుతుందని.. జనాల్లో అనుమానం మొదలైంది.  కారణం ఈ మద్య ఏటీఎం లలో రూ. 2000 నోట్లు ఎక్కువగా రావడం లేదు.. దాంతో ఈ నోటు ప్రభుత్వం రద్దు చేస్తారేమో అనుమానాలు ప్రజల్లో వచ్చాయి. ప్రధాని మోదీ 2016లో పెద్ద నోట్లు రూ.1000 రద్దు చేసిన తర్వాత కొత్తగా రూ. 2000 నోట్లు చలామనీలోకి వచ్చాయి.

 

ఇవి వచ్చిన కొన్ని రోజులు బాగానే ప్రజల చేతికి వచ్చేవి. కానీ చాలా కాలంగా వాటి జాడ కరువైంది. ఈ ఆర్థిక సంవత్సరం(2019-20)లో రూ.2 వేల నోట్ల ముద్రణ కోసం ఏ సంస్థకూ ఇండెంట్‌ పెట్టలేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి అనురాగ్‌సింగ్‌ ఠాకూర్‌ తెలిపారు. ఈ నోట్ల రద్దుపైనా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సోమవారం లోక్‌సభలో ఓ లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రూ.2వేల నోటు చలామణిలో వినియోగదారులకు ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఏటీఎంలను రూ.500, రూ.200 నోట్లు పెట్టేందుకు వీలుగా మార్పులు చేయాలని ఎస్‌బీఐ, ఇండియన్‌ బ్యాంకులు సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు.

 

దీనిపై ఎవరికీ ఎటువంటి అనుమానాలు అవసరం లేదని స్పష్టం చేశారు. తాజా ప్రకటనతో ప్రజల్లో ఉన్న అనుమానాలు తొలగిపోయాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎప్పటిలాగే రూ. 2 వేల నోట్లను చలామనీ చేసుకోవచ్చని సూచిస్తున్నారు. కాగా,  కరోనా కారణంగా చైనాతో వాణిజ్యంలో అవాంతరాలు ఏర్పడినందున దేశ ఆర్థిక వ్యవస్థపై స్వల్పకాలిక ప్రభావం పడుతుందని, ఆర్థిక వ్యవస్థకు పెద్దగా నష్టం జరగలేదని అనురాగ్‌ ఠాకూర్‌ చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: