స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇంకొన్ని రోజుల్లో ఎన్నికలు జరుగుతాయి అనుకుంటున్న తరుణంలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం కమిషనర్ రమేష్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కరోనా  వైరస్ వ్యాప్తి నేపథ్యంలోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను అంటూ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వివరణ ఇచ్చారు. అయితే దీనిపై తీవ్ర స్థాయిలో జగన్ సర్కార్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ విమర్శలు కూడా చేసింది. ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్  ఎన్నికలను ఆరు నెలలపాటు వాయిదా వేయడంపై ఏకంగా సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించింది జగన్ సర్కారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా ఎన్నికల సంఘానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే ఏపీ సిఎస్ ఎన్నికల సంఘానికి లేఖ రాయడాన్ని అటు విపక్ష పార్టీలు తీవ్రస్థాయిలో తప్పుబట్టాయి. 

 

 

 ఇక తాజాగా ఏపీ సిఎస్ రాసిన లేఖకు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఘాటుగా బదులిస్తూ లేఖ రాశారు. ఈ సందర్భంగా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్  రాసిన లేఖ లో పలు విషయాలపై వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా జగన్ సర్కార్ చేస్తున్న ఆరోపణలు కూడా లేఖలో ప్రస్తావించారు ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్. దేశంలో కరోనా  పరిస్థితులపై లేఖలో వివరించిన రమేష్ కుమార్... కరోనా  వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని... అన్ని నిబంధనలకు అధికారాలకు లోబడి స్థానిక ఎన్నికలను వాయిదా వెయ్యాలి అనే నిర్ణయం తీసుకున్నాను అంటూ రమేష్ కుమార్ లేఖలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఎన్నికలను వాయిదా వేసిన ఉత్తర్వులను వెనక్కి తీసుకునే అవకాశం లేదు అంటూ లేఖలో చెప్పకనే చెప్పారు ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్. 

 

 

 ఏకంగా మూడు పేజీల లేఖను రాశారు ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్. ఈ లేఖలో మహారాష్ట్ర,  వెస్ట్ బెంగాల్ఒరిస్సా లో ఎన్నికల వాయిదా ని కూడా ఆయన ప్రస్తావించారు. అయితే ఎన్నికలు వాయిదా పడినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకోవచ్చు అంటూ ఈ సందర్భంగా లేఖలో వివరించారు ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్. అయితే ఎన్నికలు వాయిదా వేసి నందుకు జగన్ సర్కార్ తనపై వ్యక్తిగతంగా కూడా వ్యాఖ్యలు చేసిందని లేఖలో ఆరోపించారు. జగన్ సర్కార్ తనపై వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేయడం ఎంతో బాధ కలిగించింది అంటూ తెలిపారు. అయితే తాజాగా మరోసారి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తాను అధికారాలకు లోబడే నిర్ణయం తీసుకున్నానని... తాను చేసింది కరెక్టే అన్నట్లుగా మూడు పేజీల లేఖను అందించడం చర్చనీయాంశంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: