అత్యంత కీల‌క విష‌యంలో జ‌న‌సేన పార్టీ ఎలాంటి నిర్న‌య‌మూ తీసుకోవ‌డం లేద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తు న్నాయి.  గ‌త ఏడు జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఒకే ఒక ఎమ్మెల్యేను ద‌క్కించుకున్న జ‌న‌సేన‌.. ఆ ఎమ్మెల్యేను నిల బెట్టుకోవ‌డం లో మాత్రం ఆప‌శోపాలు పడుతోంది. తూర్పు గోదావ‌రి జిల్లా రాజోలు నియజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం సాధించిన రాపాక వ‌ర‌ప్ర‌సాద్ ఆదిలో తాను జ‌న‌సేన‌లోనే ఉంటాన‌ని చెప్పినా.. ఇప్పుడు కూడా అదే పార్టీలో ఉన్నా.. ఆయ‌న మ‌న‌సు మాత్రం వైసీపీలోనే ఉంది. అనేక కార్య‌క్ర‌మాల్లోనూ జ‌న‌సేన త‌ర‌ఫున ఆయ‌న పాల్గొన‌డం మానేశారు. ఇక‌, వైసీపీకి మౌత్ పీస్‌గా మారార‌నే విష‌యం కూడా తెలిసిందే.

 

అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు కూడా చూస్తూ ఊరుకున్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ తాజాగా మాత్రం చిన్న పాటి షాక్ ఇచ్చారు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి రాజోలు నియోజక వర్గంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులను జనసేన పార్టీ నేరుగా ఎంపిక చేసింది. ఆ పార్టీలో కీలకంగా వ్య వహరించే గురుదత్త ప్రసాద్‌ జనసేన తరపున పోటీ చేసే అభ్యర్థులకు  బీ-ఫారాలను అందించారు. ఈ వ్యవహారంతో జనసేన ఎమ్మెల్యేగా ఉన్న రాపాక వరప్రసాదరావును ఆ పార్టీ అధిష్ఠానం పక్కనపెట్టినట్టేనని ఆ పార్టీ వర్గీయులు బాహాటంగా ఆరోపణాస్త్రాలు సంధిస్తున్నారు.

 

జనసేన అభ్యర్థులు సొంత బలంతోనే మళ్లీ ఎన్నికల కదన రంగంలోకి దిగడం చర్చనీయాంశమైంది. అ యితే, రాపాక విష‌యంలో రెండు బిన్న‌మైన అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఒక‌టి జ‌న‌సేనాని ప‌వ‌న్ ఇప్ప‌టికైనా ఆయ‌న‌పై చ‌ర్య‌లు తీసుకున్నార‌ని కొంద‌రు అంటుంటే.. మ‌రికొంద‌రు మాత్రం ఇలా చేయ డం వ‌ల్ల పార్టీ ప‌రువు పోతుంద‌ని అంటున్నారు. ఉన్న ఒక్క‌గానోక్క ఎమ్మెల్యే పార్టీలోనే ఉన్నందున ఆ యన‌పై ఇలా వ్య‌తిరేక భావంతో చ‌ర్య‌లు తీసుకుంటే ఫ‌లితం ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

 

అలా కాకుండా జ‌న‌సేన త‌ర‌ఫున టికెట్లు ఇచ్చే బాధ్య‌త‌ను ఆయ‌న‌కేఅప్ప‌గించి ఉంటే.. రాజ‌కీయంగా జ‌న‌సేనకు మేలు జ‌రిగి ఉండేద‌ని చెబుతున్నారు. మ‌రికొంద‌రు మాత్రం ఒక్క‌డి వ‌ల్ల పార్టీకి మేలు జ‌రిగింది ఏమీలేద‌ని, సో.. వేటు వేయ‌డ‌మే మంచిద‌ని, అలా ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌లేదు... కాబ‌ట్టి ఇప్ప‌టికైనా టికెట్లు ఇచ్చే బాధ్య‌త నుంచిఆయ‌న‌ను త‌ప్పించి మంచి ప‌ని చేశార‌ని అంటున్నారు. అయితే ప‌వ‌న్ ఇచ్చిన షాక్‌కు రాపాక డ‌బుల్ షాక్ ఇస్తూ ఆయ‌న వైసీపీ టిక్కెట్ల‌ను రాజోలులో డిసైడ్ చేశారు. మొత్తానికి రాపాక విష‌యంలో జ‌న‌సేన నేత‌లు చ‌ర్యలు తీసుకునేందుకు భ‌య‌ప‌డుతున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. మొత్తానికి ప‌వ‌న్ ఇచ్చిన షాక్‌కు రాపాక డ‌బుల్ షాక్ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: