ప్రపంచంలోకి ఒక దొంగ చొరబడ్దాడు.. వీడికి ఆస్తులతో సంబంధం లేదు.. వీడికి కావలసింది ప్రజల ఆరోగ్యం.. ప్రపంచంలోని ప్రతి మనిషిని అనారోగ్యాలపాలు చేసి, వీలైతే ప్రాణాలు తీసుకువెళ్లాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు.. ఇందులో భాగంగానే ఎందరో ఆయువు తీస్తున్నాడు.. ఆరోగ్య వంతులను కబళిస్తున్నాడు.. మనం అయితే కరోనా అంటున్నాం.. ఇది ఆడనో, మగనో తెలియదు కానీ అందరి ఊపిరి తీయడమంటే తెగ ఇష్టం..

 

 

ఇకపోతే ఈ చోరుని బారిన పడకుండా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.. లేదంటే అదృష్టం బాగుంటే బ్రతుకుతాం.. లేదా ఈ లోకం నుండి మాయం అవుతాం.. అంటే చచ్చిపోతాం.. ఇక ఈ కరోనా అనే దొంగనుండి మనల్ని మనమే కాపాడు కోవాలి.. అందుకు ఏం చేయాలంటే.. జన సమూహం ఎక్కువగా ఉన్న ప్రదేశానికి వీలైనంతగా వెళ్లకపోవడం ఉత్తమం.. చేతులను మాత్రం అతిశుభ్రంగా ఉంచుకోవాలి.. ఇక చేతులు శుభ్రంగా లేనప్పుడు మీ కళ్లను గానీ ముక్కును గానీ అసలే తాకకండి.. తుమ్ములు, దగ్గులు ఉన్న వారికి దగ్గరలో ఉండకండి.. ఇతరులకు చాలా దగ్గరగా ఉండి మాట్లాడటం, షేక్‌హ్యాండ్ ఇవ్వడం లాంటి పనులు చేయకండి.. ఒక వేళ మీకు దగ్గు తుమ్ము గానీ వస్తే మోచేతిని అడ్డం పెట్టుకోండి.. లేదా అందరికి కొంత దూరంగా జరిగి అయినా చేతి రుమాలు అడ్డం పెట్టుకుని మీ పని కానిచ్చుకోండి..

 

 

ముఖ్యంగా మీ ప్రయాణాలను తగ్గించుకోవాలి.. అసలు ఇన్ని చెప్పుకునే బదులుగా ఇంటి నుండి బయటకు ఎక్కడికి వెళ్లకుండా, కష్టమో, నష్టమో ఇంట్లోనే బంధి అయ్యి, ఈ వైరస్ తగ్గేదాక ఎవర్ని వారు కాపాడుకోవడం ఉత్తమం.. ఇప్పుడు దేశమంతట కరోనా కర్‌ఫ్యూ నడుస్తున్న నేపధ్యంలో పెళ్లిలు, ఫంక్షన్లని బయటకు పరుగులు పెట్టవద్దు.. ఎక్కడికైనా వెళ్లవలసి వస్తే ముఖానికి మాస్క్ తప్పని సరిగా ధరించాలి.. ఏదైనా అనారోగ్యంగా అనిపిస్తే వైద్యున్ని సంప్రదించి సరైన మందులు వాడండి.. ఇక ఇప్పటికే అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు తగు చర్యలను చేపడుతున్న నేపధ్యంలో మనవంతుగా కరోనా భారీ నుండి మనల్ని మనం రక్షించుకుందాం.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: