శంషాబాద్ ఎయిర్‌ పోర్ట్ ఇది హైదరాబాద్ లో ఉంది. ఎప్పుడు ప్రయాణికులతో ఎయిర్‌ పోర్ట్ రద్దీగా ఉంటుంది. ప్రస్తుతం కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో కరోనాని లెక్క చేయకుండా.. అంతకుముందు ఎలా ఉండేదో రద్దీ ఇప్పుడు అలానే ఉంది. విదేశాల నుంచి చాలా మంది పర్యాటకులు, ప్రజలు వాస్తు పోతూనే ఉన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారికి అధికారులు మాములుగా థెర్మల్ స్క్రీన్ టెస్టులూ, ఇవి అవి అంటూ వాళ్ళ ఫార్మాలిటీస్ ప్రకారం జరిపి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా సోమవారం రాత్రి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ లోని షార్జా నుంచి జి9 458 బోయింగ్ విమానం ఎయిర్‌ పోర్ట్ రన్‌ వే పై ల్యాండ్ అయ్యింది. ఆ విమానం నుంచి వరుసగా ఒకరి తర్వాత ఒకరు దిగి ఎయిర్ పోర్ట్ లోకి పోతున్నారు. అలా ఆ విమానం నుంచి దిగిన వ్యక్తులలో ఒకడు హమ్ చేసుకుంటూ లోపలి ప్రవేశించాడు. అందరి లాగానే అతని కూడా చెక్ చేస్తున్నారు అక్కడి అధికారులు.

 

నథింగ్.. సర్ చెక్ కంప్లీట్ లీ అంటూ .. అతని లగేజీని మొత్తం స్కాన్ మిషన్‌ లో పెట్టారు. సెక్యూరిటీ కూడా అతన్ని బాగానే చెక్ చేసింది. ఎటువంటి అనుమానం రాలేదు. తర్వాత రెగ్యులర్ గా చేసే థెర్మల్ స్క్రీనింగ్ టెస్ట్ చేశారు. దాంట్లో కూడా ఎటువంటి లోపం లేదు. కారోనా లక్షణాలు లేవని నిర్దారించుకున్న అధికారులు అతన్ని ఇట్స్ ఒకే నువ్వు వేళ్ళు అంటూ సైగ చేశారు. ఆ వ్యక్తి కూడా థాంక్యూ అంటూ తన లగేజీ తీసుకొని వెళ్ళాడు.

 

 

ఇప్పుడు మొదలయింది కదా అసలు విషయం.. అతను ఎగ్జిట్ డోర్ దగ్గరకు వెళ్తున్న సమయంలో.. ఒక అధికారి అతన్ని ఆపండి అంటూ గట్టిగా అరిచాడు. ఇంతకు ఏమైందంటే అతను వెళ్తున్న సమయంలో లగేజీలోని ఓ జిప్ పుల్లర్ మెరిసింది.  అది చూసిన అధికారి మిగతా జిప్పులన్నీ మెరవటంలేదని ఆ అధికారి గమనించాడు. దీంతో అతన్ని పక్కకి తీసుకొచ్చారు అధికారులు మెరిసిన జిప్ ఏంటి అని చూశారు. అది బంగారంతో తయారు చేసిన జిప్. మొత్తం చెక్ చేసిన అధికారులు లగేజీలోని అన్ని జిప్పుల పుల్లర్లూ బంగారంతో చేసినవే అని నిర్దారించుకున్నారు. కానీ వాటిపైనా సిల్వర్ కోటింగ్ వేయడంతో అధికారులు గుర్తించలేకపోయారు.

 

అయితే.. అధికారులు అతని దగ్గరి నుంచి 133.5 గ్రాముల స్మగ్లింగ్ గోల్డును కస్టమ్స్ యాక్ట్ కింద సీజ్ చేశారు. దీని విలువ మొత్తం రూ.5.50 లక్షలుగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. శంషాబాద్ ఎయిర్‌ పోర్ట్ లో ఎన్నో రకాల స్మగ్లింగ్ లు బయట పడ్డాయి. కానీ ఈ రీతిలో చేసింది మొదటి సారి అని అధికారులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: