చైనా దేశంలోని వుహాన్  నగరంలో గుర్తించబడిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలకు శరవేగంగా వ్యాపిస్తున్న  విషయం తెలిసిందే. ఇప్పటికే వంద దేశాలకు పైగా ఈ మహమ్మారి వైరస్ పాకిపోయింది. దీంతో ప్రపంచ దేశాలన్నీ చిగురుటాకులా వణికిపోతోన్నాయి . అయితే ఇప్పటికే భారత దేశానికి కూడా ఈ మహమ్మారి వైరస్ వ్యాప్తి చెందిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు భారత దేశంలో వందకు పైగా కరోనా  పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక భారత దేశపు దాయాది దేశమైన పాకిస్థాన్లో కూడా కరోనా  అడుగుపెట్టి ఇప్పటికే రోజులు గడిచి పోతున్నాయి. అక్కడ కూడా ఎంతో మంది ప్రజలను ప్రాణభయంతో వణికిస్తుంది ఈ మహమ్మారి. 

 

 

 అయితే పాకిస్థాన్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి కారణంగా ఇప్పటి వరకు పాకిస్తాన్ లో ఎటువంటి అవాంఛనీయ ఘటన మాత్రం చోటు చేసుకోలేదు. కానీ కరోనా వైరస్ తో పాకిస్తాన్ పోరులో పాకిస్తాన్ కి తొలి ఎదురుదెబ్బ తగిలింది. పాకిస్తాన్ ఎన్ని ముందస్తు చర్యలు చేపట్టినప్పటికీ పాకిస్తాన్ లో తొలి కరోనా వైరస్ మరణం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి అక్కడి ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం. కరోనా  వైరస్ సోకి చికిత్స పొందుతూ మరణించిన బాధితుడు... హఫీజాబాద్ కి చెందిన వ్యక్తి. ఈ వ్యక్తి గత కొన్ని రోజుల క్రితం చైనా తర్వాత కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న దేశమైనా ఇరాన్  నుండి పాకిస్థాన్  వచ్చాడు. ఇక ఇరాన్ నుండి తిరిగి వచ్చిన సమయంలో ఈ వ్యక్తికి కరోనా వైరస్ లక్షణాలు ఉండడంతో అతనిని... గత రెండు వారాలుగా ఇరాన్ -టాఫ్టాన్   సరిహద్దు వద్ద క్వారంటైన్ లో ప్రత్యేక  చికిత్స అందుకుంటున్నాడు. 

 


 ఇక ఇటీవల బాధితుడి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో... అతడిని లాహోర్ మయో  ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. చికిత్స పొందిన తర్వాత బాధితుడు... చివరికి కరోనా మహమ్మారి తో పోరాడలేక  ప్రాణాలు వదిలాల్సి  వచ్చింది. ఈ ఘటనతో పాకిస్థాన్ ప్రజల్లో భయం మొదలైంది. పాకిస్తాన్ దేశంలోకి కరోనా  వ్యాప్తి అయినప్పటికీ ఇప్పటివరకు... పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకున్న  జాగ్రత్తలు చర్యల వల్ల ఒక మరణం కూడా సంభవించ లేదు. కానీ తాజాగా కరోనా  బాధితుడు మొదటి మరణంతో పాకిస్తాన్ కు ఎదురు దెబ్బ తగిలింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: