కరోనా వైరస్ ప్రబలుతుంది కాలేజీకి వెళ్లొద్దు అంటూ  కుమారుడికి సూచించింది ఇక్కడ ఒక తల్లి.. ఈ ఒక్కరోజు వెళ్ళొస్తానమ్మ... రేపటి నుంచి వెళ్ళను అంటూ  ఆ యువకుడు తల్లి చెప్పి కాలేజీ కి బయల్దేరాడు. కాలేజీకి వెళ్లి వస్తానని చెప్పి బయటకు బయలుదేరిన ఆ యువకుడు... కాసేపటికి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు. అతనికి తల్లికి తీరని  కడుపు శోకాన్ని  నింపాడు. ఆ యువకుని కొద్దిసేపటికి రైలు  రూపంలో మృత్యువు కబళించింది. ఈ విషయం తెలుసుకున్న తల్లి బోరున విలపించింది. ఈ విషాద ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఆ యువకుడు మరణంతో గ్రామంలో ఒక్కసారిగా విషాదం నిండిపోయింది. 

 

 వివరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లా  సంఘం తూర్పుకు వీధికి చెందిన ఉపాద్యాయుడు నరసింహ రెడ్డి, సునీతల కుమారుడు రామ్ ప్రతాప్ రెడ్డి. ఈ యువకుడు నెల్లూరులోని వీఆర్ లా కళాశాలలో సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఈ క్రమంలోనే రోజులాగే కాలేజీకి వెళ్లి వస్తాను అంటూ తల్లికి చెప్పాడు. అయితే కరోనా వైరస్ వస్తుందని కాలేజీకి వెళ్ళద్దు అంటూ తల్లి సూచించింది. ఈ ఒక్కరోజు వెళ్తానని రేపటి నుంచి వెళ్ళను తల్లికి సర్దిచెప్పి ఇంటి నుంచి బస్సులో నెల్లూరు చేరుకున్నాడు. ఇక మినీ బైపాస్ రోడ్ లో దిగి నడుచుకుంటూ కాలేజీ కి బయల్దేరాడు. ఈ క్రమంలోనే విజయమహల్ గేట్ సమీపంలో రైలు పట్టాలు దాటుతున్న సందర్భంలో ఆ యువకుని మృత్యువు కబళించింది. హెడ్ సెట్  అతని ప్రాణం తీసింది. 


 హెడ్ సెట్ చెవిలో పెట్టుకొని పాటలు వింటూ ముందుకు నడుస్తున్న ఆ యువకుడు ట్రైన్ రావడాన్ని గమనించలేదు . ఇంతలో ఆ యువకుడు పట్టాలపైనకి వెళ్ళగానే రైలు ఢీ కొట్టింది . దీంతో అక్కడికక్కడే చనిపోయాడు ఆ యువకుడు. దీంతో వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు.. యువకుడి వివరాలు సేకరించి తల్లితండ్రులకు సమాచారం  సమాచారం అందించారు. కొడుకు మరణవార్త తెలుసుకున్న తల్లి బోరున విలపించింది... ఇక తండ్రి  సంఘటన స్థలానికి చేరుకోగా... ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు కళ్లముందే విగతజీవిగా కనిపించడం చూసి ఆ తండ్రి బోరున విలపించాడు. ఆ తండ్రి విలపిస్తున్న తీరు అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: