కరోనాకు పుట్టిల్లైనా చైనాలో రెండు నెలల క్రితం వరకు గడ్దు పరిస్దితులు ఎదురైనాయి.. ఒక రకంగా అక్కడి ప్రజలు బయటకు వెళ్లి ఏదైనా తెచ్చుకుని తిందామంటే భయపడే పరిస్దితులను ఎదుర్కొన్నారు.. ఆర్ధిక పరంగా, టెక్నాలజీ పరంగా భారత్ కంటే ముందుండే చైనా తాను పుట్టించిన కరోనాను సమర్దవంతంగా ఎదుర్కొని, ఒక రకంగా తన బలాన్ని నిరూపించుకుంది.. ఇంతటి దుస్దితి గనుక భారత్‌కు వస్తే చైనా ప్రదర్శించినటువంటి మనో బలాన్ని, దైర్యాన్ని మన ప్రభుత్వాలు ఎదుర్కొని ఎంతవరకు ప్రజల ప్రాణాలు కాపాడుతారనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతుంది..

 

 

ఇప్పటికే పిల్లిలా నక్కి నక్కి ఊపిరిలో తిష్టవేస్తున్న కరోనా ముందు ముందు మరింతగా వింజృంభిస్తే ఇక్కడి పరిస్దితులను ఎలా కంట్రోల్ చేస్తారో అనే భయం ప్రతి భారతీయుల్లో కనిపిస్తుంది.. కేవలం తెలంగాణాలో టీఎస్ఆర్టీసీ బంద్ పాటిస్తేనే ఇక్కడి ప్రజలు విపరీతమైన దోపిడికి గురైయ్యారు.. ఆ తర్వాత బస్సులు స్టార్ట్ అయినా, బస్సు చార్జీలు పెంచి ఆ నష్టాన్ని ప్రజల నెత్తిమీదే పడవేసారు.. ఇలాంటి బలహీనమైన వ్యవస్ద ఉన్నటువంటి మనదేశంలో ఇప్పుడు కరోనా వల్ల జన జీవనం అస్తవ్యస్దంగా మారిపోతే, అప్పుడు సరకులు రాక అన్ని నిత్యావసర వస్తువులు బ్లాక్ మార్కెట్లోకి తరలి.. తర్వాత అధిక ధరలకు విక్రయాలు జరుగుతాయనే అనుమానం ప్రజల్లో ఇప్పుడు కలుగుతుంది..

 

 

ప్రపంచంలో ఏ విపత్తు సంభవించిన ధనికులకు మాత్రం ఎలాంటి నష్టం ఉండదు.. నష్టపోయేది సామాన్య ప్రజలే.. పోయేది ఇలాంటి జనుల ప్రాణాలే.. ఇక ఇప్పుడు కరోనా వల్ల కలిగే ఉపద్రవాన్ని తట్టుకోవాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలో అవన్ని ఖచ్చితంగా అమలు చేయాలి.. లేదంటే భారతదేశ పరిస్దితి కరోనా ఉగ్రవాదానికి బలిగాక తప్పదు.. మరి ఇలాంటి పరిస్దితుల్లో ప్రజలందరు ఇంట్లోనే ఉండాలనే ఆంక్షలు పెడితే మాత్రం ముందస్తుగా రెండు నెలలకు సరిపడా సరకులు తెచ్చుకుని ఇంట్లో నుండి కాలు బయట పెట్టకుండా గడపవచ్చూ.. కానీ అది అందరికి సాధ్యం కాదు.

 

 

ఉన్నత వర్గాల వారికి ఇది సమస్యే కాదు.. కానీ పేద మధ్య తరగతి ప్రజలు ఈ విపత్తును ఎదుర్కోవాలంటే కొంత కష్టమే మరి తప్పదు కదా.. ఇలాంటి పరిస్దితుల్లో ప్రాణాల మీద ఆశ ఉన్నవారు ముందస్తూ జాగ్రత్తలు పడతారు.. ఇక డబ్బులేని పేదవారి ప్రాణాలు ఉంటే ఎంత పోతే ఎంత అని ఆలోచించే వారే ఉన్నారు గాని అయ్యో పాపం అనే వారు ఎక్కడ కనిపించరు.. ఇక మరణాలు సంభవిస్తే నాయకులకు ఓటర్లు తగ్గిపోతున్నారనే బాధ ఉంటుందే తప్పితే నిజంగా ప్రజల కోసం పని చేసే నాయకున్ని ఒక్కరినైన చూపండంటున్నారు కొందరు ఆవేదనతో.. ఏది ఏమైనా ఈ కరోనా మృగానికి బలికావడానికి ఎంతమంది సిద్దంగా ఉన్నారో కాలమే నిర్ణయించాలి.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: