ప్రపంచాన్ని గజగజ లాడిస్తున్న కరోనా వైరస్ ప్రస్తుతం భూమి మీద ఉన్న అన్ని ఖండాలలో వ్యాపించి ఉంది. ఈ మహమ్మారి దెబ్బకు అన్ని దేశాల నాయకులు మరియు ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. చైనా దేశంలో పుట్టిన ఈ వైరస్ ఇటలీలో భయంకరంగా మనుషులను బలితీసుకుంది. ఇండియాలో ఎంటరైన ఈ వైరస్ ఎక్కువగా మహారాష్ట్రలో వ్యాపించి ఉంది. ఇదిలా ఉండగా ఈ వైరస్ గురించి విరుగుడు కోసం చాలామంది దేశాలు శాస్త్రవేత్తలు అనేక ప్రయోగాలు చేపడుతూ వస్తూ ఉండగా తాజాగా ఎట్టకేలకు అమెరికా కరోనా వైరస్ వ్యాక్సిన్ కనుగొన్నట్లు సమాచారం. దీంతో తాజాగా కనుగొన్న వ్యాక్సిన్ నీ మనుషుల మీద ప్రయోగించడానికి అమెరికా రెడీ అయ్యింది. ఈ వ్యాక్సిన్ కి నామకరణం mrna-1237 గా పెట్టారు. Nih శాస్త్రవేత్తలు దీన్ని కనుగొన్నారు.

 

మొదటి ప్రయోగంగా 18 నుండి 55 వయసు మధ్య వారిపై ప్రయోగించడం జరిగింది. ఆరు వారాల పాటు ఈ ప్రయోగం జరగనున్నట్లు covid 19 కి వ్యతిరేకంగా ఈ వ్యాక్సిన్ బాగా పనిచేస్తున్నట్లు సమాచారం. దీంతో ప్రపంచ దేశాలు అన్న ఈ వ్యాక్సిన్పై దృష్టి సారించాయి. అమెరికా కూడా చాలా తొందరగానే ఈ వ్యాక్సిన్ ని అందుబాటులోకి తీసుకురావడానికి రెడీ అవుతుంది. యూరప్ ఖండాలలో ఎక్కువగా  కరోనా వైరస్ ప్రభావం ప్రమాదకరంగా మారటంతో ఆ దేశంలో ఉన్న శాస్త్రవేత్తలు కూడా ఈ వ్యాక్సిన్ పనితనం పై పరిశోధనలు చేపట్టారు.

 

ప్రస్తుతం లక్షా తొంభై వేల మంది కరోనా వైరస్ వల్ల బాధపడుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. మొత్తంమీద చూసుకుంటే ఈ వ్యాక్సిన్ ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రావాలంటే ఓ రెండు నెలల్లో అంతా ఓకే అయితే రావొచ్చని అంతర్జాతీయ స్థాయిలో వార్తలు వస్తున్నాయి. మరోపక్క ఇజ్రాయెల్ దేశం కూడా వ్యాక్సిన్ కనిపెట్టినట్లు అది కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు రెండు నెలలో కరోనా వైరస్ కి కచ్చితంగా ఒక పరిష్కారం దొరికే అవకాశం ఉన్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: