ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రోజురోజుకీ ముదురుతున్నాయి. స్థానిక ఎన్నికలు వాయిదా పడటంతో తలపట్టుకున్న వైయస్ జగన్ సొంత పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు ఒకరిపై ఒకరు విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారు... అన్ని పార్టీలో టాక్. పూర్తి మేటర్ లోకి వెళితే రాయలసీమ ప్రాంతం చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం ఎమ్మెల్యే రోజా కి మరియు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మధ్య విభేదాలు నువ్వానేనా అన్నట్టుగా గ్రూపు రాజకీయాలు చిత్తూరు జిల్లాలో ముదురుతున్నట్లు బలమైన వార్తలు ఇటీవల వినబడుతున్నాయి. కావాలని ఇద్దరు నేతలు జిల్లాలో గ్రూపు రాజకీయాలను ఎంకరేజ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పెద్ద రెడ్డి రామచంద్ర రెడ్డికి పార్టీలో మంచి విలువ ఇచ్చిన వైయస్ జగన్ ఆయన కుమారుడు మిథున్ రెడ్డి కి రాజంపేట ఎంపీ గా స్థానం కల్పించి పార్టీలో సముచిత స్థానం లో కూర్చోబెట్టారు.

 

దీంతో చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హవా నడుస్తోంది. అయితే అందరం ఏ జిల్లాలో కంట్రోల్ చేస్తున్న రామచంద్ర రెడ్డికి నగరి ఎమ్మెల్యే రోజా అసలు లొంగక పోవడంతో ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు రాజకీయాలు నువ్వానేనా అన్నట్టుగా ఉన్నట్లు సమాచారం. న‌గ‌రి నియ‌జ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుస‌గా రెండోసారి కూడా విజ‌యం సాధించిన రోజా కూడా జిల్లాలో అంతో ఇంతో ప‌ట్టు పెంచుకునేందుకు ప్రయ‌త్నిస్తున్నారు. ఈ క్రమంలోనే జ‌గ‌న్ కేబినెట్‌లో మంత్రి ప‌ద‌విని కూడా ఆశించారు.

 

అయితే, సామాజిక స‌మీక‌ర‌ణ‌ల్లో భాగంగా ఆ అవ‌కాశం ల‌బించ‌లేదు. అయితే,దీనివెనుక పెద్దిరెడ్డి చ‌క్రం తిప్పార‌నే వాదన అప్పట్లో బ‌లంగా వినిపించింది. ఈ క్రమంలోనే పెద్దిరెడ్డికి రోజాకు మ‌ధ్య గ్యాప్ పెరిగింది. దీంతో ప్రస్తుతం క్యాబినెట్ లో రెండు మంత్రి పదవులు ఖాళీ అవటంతో ఎలాగైనా క్యాబినెట్ లో కి వెళ్ళాలి అని చూస్తున్నా రోజా కి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అడ్డుపడుతున్నారని...స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రామచంద్రారెడ్డి వర్గీయులతో రోజా తన అనుచరులను ఉసి గోలుపుతున్నట్లు వార్తలు ఎక్కువవడంతో...వైఎస్ జగన్ దృష్టికి వెళ్లడంతో రోజా - పెద్దిరెడ్డి ఇద్దరినీ తన ఛాంబర్ కి పిలిపించుకొని క్లాస్ పీకినట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: