చంద్రబాబు రెండు నాలుకల ధోరణి మరోసారి బయట పడినట్లు అయింది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం సందర్భంగా ...అక్కడ ఉన్న టైంలో తెలంగాణకు సపోర్ట్ చేస్తూ వ్యవహరించిన చంద్రబాబు ఆ తర్వాత రాష్ట్రాన్ని విభజించే విధంగా ఆ పరిణామం చోటు చేసుకుంది. చాలా సందర్భాలలో రెండు నాలుకల ధోరణి ప్రదర్శించినా చంద్రబాబు ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల టైంలో కూడా అదే విధంగా వ్యవహరించడంతో మరోసారి బయటపడింది. ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వివిధ దేశాల నాయకులు అదే విధంగా ప్రపంచ స్థాయిలో ఉన్న అంతర్జాతీయ మీడియా మొత్తం అంతా ఈ విషయం పైన ఫోకస్ ఎక్కువగా పెట్టింది.

 

ఇటువంటి నేపథ్యంలో స్థానిక సంస్థలు ఎన్నికలు వాయిదా పడటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. వైరస్ ప్రభావం లేని రాష్ట్రంలో ఈ విధంగా ఎన్నికల కమిషనర్ నిర్ణయం తీసుకోవడాన్ని ముఖ్యమంత్రి జగన్ తప్పుపట్టడం జరిగిన ఈ క్రమంలో ముఖ్యమంత్రి జగన్ ఆగ్రహంపై చంద్రబాబు స్పందించిన తీరు చూస్తే.. రాజకీయాలపై కాస్తంత అవగాహన ఉన్న ఎవరికైనా సరే.. మళ్లీ రెండు నాలుకల సిద్ధాంతం గుర్తుకు రాక మానదు.

 

ఎందుకంటే.. ఎన్నికలు నిర్వహిస్తే ప్రజలంతా గుమిగూడాల్సి వస్తుంది కాబట్టి.. కరోనా ప్రభావంతో ఇబ్బంది తలెత్తదా.. ఆ మాత్రం ఆలోచన లేదా.. అంటూ చంద్రబాబు మాట్లాడుతున్నారు.కానీ.. అదే ప్రజలు గుమిగూడటం అన్నది అమరావతి ఆందోళనలకు వర్తించదా.. అన్న ప్రశ్న ఇప్పుడు వైసీపీ వర్గాల నుంచి బలంగా వ్యక్తమవుతోంది. టీడీపీతోపాటు.. వారి అనుకూల వర్గాల ప్రోద్బలంతో జరుగుతున్న ఈ ఆందోళనల్లో.. కరోనా ప్రభావంపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది. మొత్తం మీద వైసిపి లాజిక్ తో అమరావతి నడిబొడ్డులో చంద్రబాబు ఇరుక్కున్నాటు అయ్యింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: