ఈ మద్య సైబర్ నేరగాళ్ల జోరు బాగా పెరిగిపోయింది.  ఈజీ మనీ సంపాదన కోసం టెక్నాలజీని వాడుకుంటూ జనాలకు టోకరా వేస్తున్నారు.  అకౌంట్స్ హ్యాక్ చేసి అందినంత దోచుకుంటున్నారు. అంతే కాదు డూప్లికేట్ ఏటీఎం కార్డులు తయారు చేసి డబ్బులు డ్రా చేసుకుంటున్నారు.  క్లోనింగ్ విధానంలో ఏటిఎం కార్డులు తయారు చేస్తున్న ముఠాను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన ముగ్గురు నిందితులూ ఒడిశాకు చెందిన చెందిన వారని పోలీసులు పేర్కొన్నారు. క్లోనింగ్ తో పాటు నకిలీ కార్డులను కూడా తయారు చేస్తుంది ఈ ముఠా.

 

గచ్చిబౌలి హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు మేనేజర్ ఫిర్యాదుతో  పోలీసులు దర్యాప్తు చేయగా ఈ క్లోనింగ్ భాగోతం బయటపడింది. నిందితుల వద్ద రూ.10 లక్షల నగదుతో పాటు స్కిమర్, క్లోనింగ్ మిషన్, 44 క్లోనడ్ కార్డ్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇప్పటి వరకు 140 కార్డులను క్లోనింగ్ చేసి రూ.13 లక్షలు విత్ డ్రా చేశారు.  ఏటీఎం కార్డులు వాడుతున్న వారిని ఫాలో అవుతు అమాయకులను టార్గెట్ చేస్తున్నారు.  ఈ ముఠాలో ప్రధాన నిందితుడు ప్రఫుల్ కుమార్ టెన్త్ క్లాస్ వరకు చదివాడు. కానీ ఇతడు మొదటి నుంచి నేర స్వభావంతో ఉన్న వాడని పోలీసులు అంటున్నారు. 

 

ఆపై లైన్ లో స్కిమర్, క్లోనింగ్ మిషన్ లను కొనుగోలుచేసి హై క్లాస్ రెస్టారెంట్లు, పబ్ లలో వెయిటర్ లుగా చేరుతారు. కస్టమర్ బిల్లులు చెల్లించేటప్పుడు తమ వెంట తెచ్చుకున్న స్కిమర్ సహాయంతో కార్డులోని డేటాను దొంగిలిస్తారు. ఆ తర్వాత తమ ప్లానింగ్ అమలు చేస్తుంటారు. అయితే ఈ టక్కరి దొంగలు పబ్ లలో, రెస్టారెంట్లల్లో పది రోజుల పాటే పనిచేసి మానేస్తారు. ఎవరికీ అనుమానం రాకుండా మేనేజ్ మెంట్ తో చిన్న గొడవనో.. ఏదో ఒక అలిగేషన్ క్రియేట్ చేసి అక్కడ నుంచి జంప్ అవుతుంటారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: