కరోనా విపరీతంగా విజృంభిస్తున్న సమయంలో దీనికి విరుగుడుగా వాక్సిన్ తయారు చేయాలని ఎన్నో కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి.. ఇప్పటికే దీనికి ఒక రూపం వచ్చిందనే వార్తలు కోకొల్లలుగా వస్తున్నాయి.. కానీ ఇది ఎంతవరకు నిజం అనే విషయం ఇప్పటి వరకు అధికారికంగా ఎవరు ప్రకటించ లేదు.. అయితే ఇప్పటికే ఈ కరోనా నిరోధక టీకా విషయంలో మాటల యుద్ధం మొదలైందట.. అమెరికా కొన్ని నక్కజిత్తుల వేషాలు వేస్తుందని అనుకుంటున్నారట.. అదేమంటే  కరోనా నిరోధక టీకా ఒకటి క్యూర్‌వ్యాక్‌ అనే కంపెనీ తయారు చేస్తుందట.. కాగా ఈ ప్రయోగం అమెరికా, జర్మనీల మధ్య మాటల యుద్ధానికి కారణమవుతోంది.

 

 

ఇలా ఎందుకు జరుగుతుందంటే.. జర్మనీకి చెందిన ఈ కంపెనీ అభివృద్ధి చేస్తున్న టీకాపై తాము హక్కులు కొనుక్కుంటామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించడంపై జర్మన్లు విరుచుకు పడుతున్నారట. ఇప్పటికే ట్రంప్ చేసిన వాఖ్యలపై ఆ దేశ ఆర్థిక శాఖ మంత్రి పీటర్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడని సమాచారం.. ఇకపోతే డైవెల్ట్‌ అనే పత్రిక ప్రచురించిన కథనం ప్రకారం.. జర్మనీ అమ్మకానికి పెట్టని ఈ కరోనా వ్యాక్సిన్ కోసం అమెరికా తహతహలాడుతుందని, ఇదే కాకుండా టీకాపై హక్కుల కోసం అమెరికా 100 కోట్ల డాలర్లు ఆశచూపుతూ, కేవలం ఆ టీకా అమెరికాలో వాడాలన్న షరతుని విధిస్తుందట...

 

 

ఇదిలా ఉండగా మరోవైపు, క్యూర్‌వ్యాక్‌లో పెట్టుబడులు పెట్టిన వారు మాట్లాడుతూ ఏ ఒక్క ప్రభుత్వానికో తాము టీకా అమ్మబోమని స్పష్టం చేశారు. సమర్థమైన టీకా అందుబాటులోకి వస్తే అది ప్రపంచ ప్రజలందరినీ రక్షించాలని కోరుకుంటున్నట్లు డైట్‌ హాప్‌ అనే పెట్టుబడిదారు వ్యాఖ్యానించారు.. చూసారా పెద్దన్న పెత్తనం.. ప్రపంచానికి మంచిచేయాలనే ఆలోచన లేకుండా కేవలం అమెరికా ప్రజల కోసం మాత్రమే ఆలోచిస్తున్నాడని అనుకుంటున్నారట ఈ విషయం తెలిసిన వారు.. మరి ఇందులో నిజనిజాలు ఎన్ని ఉన్నాయో ఆ భగవంతునికే తెలియాలి...

మరింత సమాచారం తెలుసుకోండి: