మహిళలపై రోజురోజుకు అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి ఉన్న విషయం తెలిసిందే. ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా ఎన్ని కఠిన  శిక్షలు విధించిన  అధికారుల్లో  మాత్రం మార్పు రాలేదు. ఆడది కనిపిస్తే చాలు కామంతో కళ్లు మూసుకుపోయి మీద పడి పశువాంచ తీర్చుకుంటున్నారు. కనీసం అత్యాచారానికి పాల్పడితే శిక్ష పడుతుంది అనే భయం వారిలో కనిపించడం లేదు. వెరసి రోజురోజుకు మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. మంచి వాళ్ళ మసుగులో  ఉండే సమయం సందర్భం చూసుకుని తమలోని అసలు నిజస్వరూపాన్ని బయటపెట్టి ఆడపిల్లలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు కామాంధులు . ఇలాంటి ఘటనలు ఈ రోజుల్లో ఎక్కువైపోతున్నాయి. ఇక తాజాగా ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. 

 

 

 యువతిని నమ్మకంగా రప్పించి నలుగురు యువతులు ఆ యువతి పై దారుణంగా సామూహిక అత్యాచారం చేశారు. ఈవెంట్ మేనేజ్మెంట్ కు  సంబంధించిఒప్పందం  కుదుర్చుకున్నామని రాష్ట్రం కాని రాష్ట్రం రప్పించి... మనుషులని మరిచిపోయి  కామం తో ఊగిపోయిన ఆ యువతిపై దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఇక ఆ నలుగురు యువకుల హింసకు  తట్టుకోలేక సదరు యువతి కేకలు వేయడంతో స్థానికులు వెంటనే స్పందించారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ లో ఉండే... సమీర్ అమిత్ అనే యువకులకి.. గౌహతి కి చెందిన ఈవెంట్ మేనేజ్మెంట్ లో పనిచేస్తున్న ఓ యువతి పరిచయమైంది. ఇక కొద్ది నెలలపాటు వీరు మాట్లాడుకోవడం తో స్నేహం కూడా ఏర్పడింది. ఈ క్రమంలోనే ఆ యువతిపై ఎలాగైనా కామ వాంఛ తీర్చుకోవాలని భావించారు ఆ ఇద్దరు యువకులు.

 

 

 

 దీంతో ఈవెంట్ మేనేజ్మెంట్ కు సంబంధించిన డీల్ చేసుకుందాము అంటూ యువతిని కాన్పూర్ రప్పించారు . ఇక కాన్పూర్ కి రాగానే మొదట  ఒక హోటల్ గదిలో ఉంచారు. ఇక తర్వాత రోజు నగరంలో రిచ్ ఏరియా గ్వాల్తోలిలో ఓ బంగ్లాకి వెళ్లగా... అక్కడ మనోజ్,  సక్ష్ అనే మరో ఇద్దరు స్నేహితులతో కలిసి ఆమెపై నలుగురు మూకుమ్మడిగా లైంగిక దాడికి పాల్పడ్డారు. ఏకంగా మూడు రోజుల పాటు నరకం చూపించారు. వారి క్రూర ప్రవర్తనతో భయాందోళనకు గురైన యువతి అక్కడి నుంచి తప్పించుకునేందుకు పెద్దగా కేకలు వేయగా.. స్థానికులు స్పందించి సంఘటనా స్థలానికి చేరుకుని జరిగిన విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. ఈ సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని... ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకోగా పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు ఆమిత్  కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: