ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రమాద ఘంటికలు మోగుతున్న నేపథ్యంలో మన రాష్ట్ర విద్యార్థులు అనేక దేశాల్లో చిక్కుకుపోయారని మాజీ మంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు.  విశాఖ విద్యార్థులు కౌలాలంపూర్ లో చిక్కుకుంటే ఏం చేస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.  స్థానిక ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్ష నేతలు పనికట్టుకొని ఆపారని అపనిందలు మాపై మోపుతున్నారు.  దేశంలో ఇప్పటికే కరోనా మరణాలు మూడు సంబవించాయి.  వైసీపీ నేతలకు కరోనా ప్రభావం కనిపించడం లేదా? అని నిలదీశారు. ప్రజల ప్రాణాలపై శ్రద్ధ వహించడం అధికారుల బాధ్యత అని స్పష్టం చేశారు. 

 

మరోవైపు రాష్ట్రంలో కరోనా వైరస్ తీరుతెన్నులపై ఏపీ వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రత్యేక బులెటిన్ విడుదల చేసింది. నెల్లూరు జిల్లాలో కరోనా బాధితుడు కోలుకుంటున్నాడని వెల్లడించింది. అతడిని 14 రోజుల తర్వాత మరోసారి పరీక్షించి డిశ్చార్జిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ఇక కరోనా ప్రభావంతో స్థానిక ఎన్నికలు వాయిదా వేసిన ఎన్నికల కమిషనర్ ను సీఎం సహా వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారని టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు మండిపడ్డారు. మీరు చెప్పిన విధంగా షెడ్యూల్ విడుదల చేసినప్పుడు అతను మంచి ఎన్నికల కమిషనర్ అని తెగ పొగిడారు.. కానీ ఇప్పుడు పరిస్థితుల  ప్రభావం వల్ల కరోనా ఎఫెక్ట్ వల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయని చెప్పి వాయిదా వేస్తే ఆయన వైసీపీ నేతలకు విలన్ అయ్యాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

ఏపీ సీఎం కులాల ప్రస్తావన తెస్తూ, ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. దేశంలోని ప్రముఖ ఆలయాలు కూడా కరోనా కారణంగా వెలవెలబోతున్నాయని, ఏపీలోనూ తిరుమల, దుర్గమ్మ ఆలయాలు బోసిపోతున్నాయి.. దీని అర్థం ఏంటీ జనాలకు కరోనా అంటే భయపడటం లేదా అని ప్రశ్నించారు.  మరి దీనిపై సదరు దీనిపై మంత్రి వెల్లంపల్లి ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: