సీ ఏ ఏ, ఎన్ఆర్సీ కి వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానం చేయడం ద్వారా తెలంగాణ  ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లిం , మైనార్టీలను తమవైపు తిప్పుకోవడం లో ఒకింత సక్సెస్ అయ్యారు   . దేశం లో ఏ ముఖ్యమంత్రి చేయనంత స్పష్టంగా సీ ఏ ఏ, ఎన్ఆర్సీని వ్యతిరేకిస్తూ కేసీఆర్ తీర్మానం చేశారంటూ  అసెంబ్లీ వేదిక ఎం ఐ ఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ  పేర్కొన్న విషయం తెల్సిందే  . అయితే సీ ఏ ఏ, ఎన్ఆర్సీ ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేయడం ద్వారా   ముస్లిం , మైనార్టీల్లో కేసీఆర్ కు ఏర్పడిన   ఇమేజ్ ను బీజేపీ నేతలు మరింత పెంచే ప్రయత్నాన్ని    చేస్తున్నట్లు కన్పిస్తోంది .

 

దేశ వ్యాప్తంగా  విపక్షాలు సీ ఏ ఏ, ఎన్ఆర్సీలను వ్యతిరేకిస్తున్నాయి . బీజేపీయేతర రాష్ట్ర  ప్రభుత్వాలన్నీ సీ ఏ ఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా తీర్మానం చేసేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి . ఇప్పటికే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తీర్మానం చేయగా , తాజాగా తెలంగాణ సర్కార్ కూడా సీ ఏ ఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా తీర్మానం చేయడంతో రాష్ట్ర కమలనాథులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు . సీ ఏ ఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా తీర్మానం చేయడమంటే దేశ ద్రోహమేనని , అందుకే   తెలంగాణ ముఖ్యమంత్రి   కేసీఆర్ పై దేశ ద్రోహం కేసు నమోదు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ , ఎంపీలు ధర్మపురి అరవింద్ , సొయం బాబురావు లు డిమాండ్ చేస్తున్నారు .

 

అయితే సీ ఏ ఏ, ఎన్ఆర్సీ లకు వ్యతిరేకంగా  రాష్ట్ర ప్రభుత్వాలెన్నీ  తీర్మానాలు  చేసిన వచ్చే నష్టమేమి లేకపోయినప్పటికీ  , రాష్ట్ర ప్రభుత్వం చేసిన తీర్మానంపై  కమలనాథులు అత్యుత్సాహం తో  విమర్శలు చేస్తున్నారు . దీనితో  సీ ఏ ఏ, ఎన్ఆర్సీ కి వ్యతిరేకంగా తీర్మానం చేసిన కేసీఆర్ పట్ల   మైనార్టీల్లో సానుకూల దృక్పధం ఏర్పడే విధంగా  బీజేపీ నేతలే పరోక్షంగా వ్యవహరిస్తున్నట్లవుతోంది  .

మరింత సమాచారం తెలుసుకోండి: