యాపిల్ కంపెనీ అధినేత స్టీవ్ జాబ్స్ 2011లో మరణించడం జరిగింది. ఆయన మరణించిన సమయానికి కోట్ల కొలది ఆస్తిపరుడు. కొన్ని బిలియన్ డాలర్ల ఆస్తిని మరణించే ముందు సమకూర్చుకున్నాడు. ఒక సాధారణ మరియు మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన స్టీవ్ జాబ్స్ దాదాపు 23 సంవత్సరాలు వచ్చేసరికి వన్ మిలియన్ డాలర్ల సంపాదన అతని ఖాతాలో ఉంది. ఇక 25 సంవత్సరాల వయస్సు వచ్చేసరికి 250 మిలియన్ల డాలర్లు సంపాదిస్తూ తన ఆస్తిని పెంచుకుంటూ పోయాడు. దీంతో ప్రపంచంలోనే బిలియన్ డాలర్లు ఆస్తిగా సమకూర్చుకుని వరల్డ్ రిచెస్ట్ మ్యాన్ గా అవతరించాడు. లెక్కించలేని అంత ధనం స్టీవ్ జాబ్స్ సంపాదించడం జరిగింది. మధ్యతరగతి సాదాసీదా కుటుంబం నుండి వచ్చిన స్టీవ్ జాబ్స్ గొప్ప స్థాయికి ఎదిగాడు.

 

అతి చిన్న వయసులోనే చాలా కష్టపడి పైకొచ్చిన స్టీవ్ జాబ్స్ తన జీవితంలో ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకున్నట్లు చాలాసార్లు చెప్పుకొచ్చారు. ముఖ్యంగా తాను ఎక్కువగా ఐ  అనే పదాన్ని ఎందుకు ఇష్టపడతారు అన్న దాని గురించి కూడా ఒకానొక సమయంలో వివరించడం జరిగింది. తన కంపెనీ 2007వ సంవత్సరంలో ఐఫోన్‌ను మార్కెట్ లోకి లాంచ్ చేసింది. iphone పేరులో తొలి అక్షరం ఐ. అది కూడా లోయర్‌కేస్. అందరూ ఆశ్చర్యానికి గుర్యయారు. కంపెనీ ఎందుకు తొలి అక్షరంగా ఐని ఎంచుకుందని. చాలా మంచి ప్రశ్నలు వేశారు. అటువంటి సమయంలో ఒక కార్యక్రమంలో 1998లో పాల్గొన్న సమయంలో ఐ అక్షరానికి తనకి ఉన్న బంధాన్ని బయటపెట్టారు.

 

‘మేకిన్‌టాస్, ఇంటర్నెట్ అనే రెండు అంశాలను దృష్టిలో ఉంచుకొని ఐమ్యాక్‌ను రూపొందించాం. ఇంటర్నెట్‌ను సరళంగా, వేగంగా అందించేలా దీన్ని తయారు చేశాం. కన్సూమర్లు కంప్యూటర్ విషయానికి వచ్చేసరికి వారికి ఐమ్యాకే తొలి ప్రాధాన్యం కావాలి’ అని స్టీవ్ జాబ్స్ వివరించారు. ఈ విధంగా తన సక్సెస్ జర్నీ కొనసాగించినా స్టీవ్ జాబ్స్ చివరి క్షణంలో తన ఆరోగ్యాన్ని కోల్పోయి చాలా బక్క చిక్కి పోయి మరణించడం జరిగింది. అయితే ఆ సమయంలో ఎక్కువగా డబ్బులు సంపాదించడం కన్నా ఆరోగ్యంపై కూడా ఎక్కువ దృష్టి పెడితే అదే పెద్ద ఐశ్వర్యం అని  స్టీవ్ జాబ్స్ తన మరణ పడకపై తన సన్నిహితుల దగ్గర అన్నట్టు చెబుతారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: