కరోనా కాటు అన్ని రంగాల పై పడుతుంది.. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అన్ని సంస్దలు ఆర్ధికంగా నష్టపోతుండగా.. మరికొన్ని సంస్దలు కీలక నిర్ణయాలు తీసుకోవడానికి సిద్దం అవుతున్నాయి.. అందులో యూట్యూబ్ ఒకటి.. ఎందరికో జీవనోపాధి కలిగిస్తున్న ఈ యూట్యూబ్ కూడా ప్రస్తుతం కరోనా కాటుకు బలైంది.. ఇక పొద్దున లేచిన దగ్గరి నుండి రాత్రి పడుకునే వరకు మనిషి జీవితంలో యూట్యూబ్ కూడా ఒక భాగమై పోయింది.. ఈ యూట్యూబ్ ద్వారా తగిన ఆదాయం పొందే వారు కూడా ఉన్నారు.. నేటి టెక్నాలజీ కాలంలో యూట్యూబ్ అనేది ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది.. ఇంతలా ప్రాచూర్యాన్ని పొందిన ఈ యూట్యూబ్ కన్నీళ్లు పెట్టుకునే సమయం ఆసన్నమైంది.

 

 

ఇక ఇప్పటి నుండి యూట్యూబర్లకు, యూట్యూబ్ చూసేవారికి కూడా ఆ సంస్ద ఒక బ్యాడ్ న్యూస్ చెబుతుంది.. అదేమంటే కరోనా వచ్చి ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సంక్షోభాన్ని సృష్టిస్తుంది.. ఇప్పటికే కరోనా వల్ల ఉద్యోగులకు వర్క్ ఫ్రం హో సిస్టాన్ని అమలు చేస్తుండగా, యూట్యూబ్ కంపెనీ కూడా తమ కార్యాలయాలలో సిబ్బందిని తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది.. ఈ సందర్భంగా అనవసరంగా ఉన్న కంటెంట్ విషయంలో ఇదివరకు ఆ ఉద్యోగులు నిర్ణయం తీసుకుని తొలగించే వారు.. కాని ఇప్పటి నుండి ఈ కంటెంట్ తొలగింపు విషయంలో యూట్యూబ్ ఆటోమేటెడ్ సిస్టమ్‌లపై ఎక్కువ ఆధారపడుతున్నట్లు తెలిపింది..

 

 

ఇది వరకు మెషీన్ లెర్నింగ్ హానికరమైన కంటెంట్‌ను గుర్తించి దాన్ని సమీక్ష కోసం ఉద్యోగులకు పంపుతుంది. కాగా కరోనా వైరస్ సంక్షోభం కారణంగా ఈ విషయంలో సాంకేతిక పరిజ్ఞానం పై ఎక్కువ ఆధారపడాల్సి వస్తున్నందున దాదాపుగా చాలా కంటెంట్‌లు డిలెట్ అయ్యే అవకాశం ఉందట.. ఇకపోతే యూట్యూబ్ ను ఉపయోగించేవారు, వీడియోలు అప్ లోడ్ చేసేవారు వీడియోల తొలగింపు ఎక్కువ కావడాన్ని గమనించ వచ్చట...

 

 

అయితే ఇలాంటి సమయంలో నియమాలను ఉల్లంఘించని కొన్ని వీడియోలు కూడా తీసివేయబడవచ్చని అయినప్పటికీ, వీడియోను అప్ లోడ్ చేసిన వ్యక్తి వారి కంటెంట్ పొరపాటున తొలగించబడిందని భావిస్తే, అప్పీల్ చేయవచ్చు. అప్పుడు ఇలాంటి కంటెంట్‌ను యూట్యూబ్ తప్పనిసరిగా పరిశీలిస్తుంది. అయితే సిబ్బంది తక్కువగా ఉండటం వల్ల వినియోగదారులు చేసే అప్పీళ్లపై సమీక్షలు ఆలస్యం కావచ్చు...

 

 

కొన్ని సందర్భాల్లో రివ్యూ చేయని కంటెంట్ సెర్చ్ ద్వారా, హోమ్‌పేజీలో లేదా రికమండేషన్ పేజీలో అందుబాటులో ఉండకపోవచ్చని యూట్యూబ్ తెలిపింది... సో యూట్యూబ్‌లో వీడియోలు అప్ లోడ్ చేసుకునే వారికి ఇది నిజంగా బ్యాడ్ న్యూస్.. అందుకే ఏవైన వీడియోలు అప్ లోడ్ చేసేటప్పుడు మంచి కంటెంట్‌కు ప్రాయారిటీ ఇవ్వండి.. లేదంటే నష్టపోవలసి వస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: