న్యాయం చేయాలిసిన పోలీసులే అన్యాయం చేస్తుంటే  సాధారణ ప్రజలు  వాళ్ళ సమస్యలని ఎవరికీ చెప్పుకోవాలి. ఎవరు తీరుస్తారు. ప్రజలకు రక్షణ అనేది కరువయింది. ఒక  పోలీసు నమ్మించి ఇద్దరు మహిళలని పెళ్లి పేరుతో  మోసం చేసాడు. ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళని పెళ్లిచేసుకున్నాడు.  ఓ మహిళతో కాపురం చేస్తూనే మరో యువతిని మభ్యపెట్టి రెండో వివాహం చేసుకున్నాడు. 

 

కొన్ని రోజులు బాగానే వ్యవహారం సాగింది. తర్వాత అడ్డంగా దొరికిపోయాడు. భర్త చేసిన నిర్వాకం   ఇద్దరు భార్యలకు తెలియడంతో అడ్డంగా బుక్కయ్యాడు.  నిజాన్ని ఎన్ని రోజులని దాస్తాడు. ఎప్పటికన్నా  నిజం బయటపడాలిసిందే. ఆ రోజు వచ్చింది. సైలెంట్ గా ఇద్దరు భార్యలు పోలిస్ ఆట  కట్టించాలని భావించి ఒక నిర్ణయానికి వచ్చారు.

 

ఆ పోలీస్  కడపజిల్లా పోలీసు శాఖలో ఏఆర్‌ విభాగంలో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్‌. మొదటి భార్య ఉండగానే,  మరో యువతిని రెండో వివాహం చేసుకున్నాడని, ఈ విషయాన్ని దాచి పెట్టి ఇద్దరితోనూ కాపురం చేస్తున్నాడని, ఇద్దరు భార్యలు   వేర్వేరుగా జిల్లా పోలీసు అధికారికి ఫిర్యాదు చేశారు.  ఈ విషయం తెలిసిన అధికారులు వెంటనే స్పందించారు. దీంతో అతడిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఎస్పీ విచారణ నిమిత్తం కేసును బదిలీ చేశారు. కానిస్టేబుల్ రెండో వివాహం చేసుకున్న వీడియో, ఫోటోలు బయటికి రావడంతో ఈ విషయం బయటకు పొక్కింది.పోలీస్ ఘనకార్యం అందరికి తెలిసిపోయింది 

 

ఈ నిజాలు సరిపోతాయి అతనికి శిక్ష పడడానికి.  విచారణలో పోలీస్ చేసుకున్న వివాహాలు నిజమని తేలితే శిక్ష మాత్రం తప్పదు.  పెళ్లి పేరుతో మోస పోయిన ఆ మహిళలు బోరున విలపిస్తున్నారు. నమ్మిన కట్టుకున్న భర్తే మోసం చేస్తే ఆ  మహిళల కష్టాలు ఇంకా ఎవరు తీరుస్తారు. మాకు తగిన న్యాయం చేయాలనీ ఇద్దరు మహిళలు పోలీస్ లని డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: